ఫాంహౌస్‌కు లబ్దికే ఎర్రవల్లి అభివృద్ధి: నాగం
ఎర్రవెల్లిలో కేసీఆర్ ఫాం హౌస్ ఉంది కాబట్టే ఆ గ్రామాన్ని బంగారువల్లిగా మారుస్తానని ప్రకటనలు చేస్తున్నారని బచావో తెలంగాణ మిషన్ స్థాపకులు, బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి ధ్వజమెత్తారు. పరిపాలనలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి, గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జెండా ఎగుర వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన గ్రామాలను వదిలిపెట్టి కేసీఆర్ తన ఫాంహౌస్ ఉన్న […]
BY Pragnadhar Reddy30 Aug 2015 6:38 PM IST

X
Pragnadhar Reddy Updated On: 31 Aug 2015 5:07 AM IST
ఎర్రవెల్లిలో కేసీఆర్ ఫాం హౌస్ ఉంది కాబట్టే ఆ గ్రామాన్ని బంగారువల్లిగా మారుస్తానని ప్రకటనలు చేస్తున్నారని బచావో తెలంగాణ మిషన్ స్థాపకులు, బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి ధ్వజమెత్తారు. పరిపాలనలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి, గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జెండా ఎగుర వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన గ్రామాలను వదిలిపెట్టి కేసీఆర్ తన ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లి గ్రామాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తామనడం దారుణమన్నారు.
Next Story