జర నవ్వండి ప్లీజ్ 191
కాలేజీ చదువు “మా వాడు హైదరాబాద్‌లో చదువుతున్నాడు.” “మా వాడూ అక్కడే ఉన్నాడు.” “మా వాడి ఉత్తరం వచ్చినప్పుడల్లా నేను డిక్షనరీ కోసం వెళ్ళాల్సి వస్తోంది.” “అదృష్టవంతులు. మావాడి ఉత్తరం అందినప్పుడల్లా నేను బ్యాంకుకు వెళ్ళాల్సి వస్తోంది.” ——————————————————————— సినిమా డైవోర్స్ హాలీవుడ్ నటీనటుల కాలనీ ముందు ముగ్గురు చిన్నపిల్లలు అట్లాడుకుంటున్నారు. ఒక అబ్బాయి “నేను నాన్నను” అన్నాడు. అమ్మాయి “నేను అమ్మను” అంది. ఇంకో కుర్రాడు “ఐతే నేను డైవోర్స్ లాయర్ని” అన్నాడు. ——————————————————————— రివర్స్ […]
కాలేజీ చదువు
“మా వాడు హైదరాబాద్‌లో చదువుతున్నాడు.”
“మా వాడూ అక్కడే ఉన్నాడు.”
“మా వాడి ఉత్తరం వచ్చినప్పుడల్లా నేను డిక్షనరీ కోసం వెళ్ళాల్సి వస్తోంది.”
“అదృష్టవంతులు. మావాడి ఉత్తరం అందినప్పుడల్లా నేను బ్యాంకుకు వెళ్ళాల్సి వస్తోంది.”
———————————————————————
సినిమా డైవోర్స్
హాలీవుడ్ నటీనటుల కాలనీ ముందు ముగ్గురు చిన్నపిల్లలు అట్లాడుకుంటున్నారు.
ఒక అబ్బాయి “నేను నాన్నను” అన్నాడు. అమ్మాయి “నేను అమ్మను” అంది. ఇంకో కుర్రాడు “ఐతే నేను డైవోర్స్ లాయర్ని” అన్నాడు.
———————————————————————
రివర్స్
ఒక కంపెనీ వాళ్ళు కొత్త డిటర్జెంట్ సోప్ తయారు చేశారు. ఆ సబ్బుని సౌదీ ఆరేబియాలో ప్రచారం చేయాలని పెద్ద ఎత్తున వాల్‌పోస్టర్లు తయారు చేశారు. వాల్‌పోస్టర్‌లో మొదట బాగా మురికిపట్టిన నల్లటి చొక్కా తరువాత ఆ చొక్కాకు సబ్బు రుద్దడం, మూడో బొమ్మలో తెల్లటి చొక్కా.
ఊరూరా వాడవాడలా ఆ వాల్‌పోస్టర్‌లు వెలిశాయి. ఎన్నాళ్ళయినా ఎవరూ ఒక్క సబ్బూ కొనలేదు. ఆరు నెలల తరువాత అసలు సంగతి తెలిసింది. సౌదీలో జనాలు కుడి నుండి ఎడమకు చదువుకుంటూ పోతారని!