Telugu Global
Others

రూ.100 కోట్లతో 500 పడకల ఎన్నారై ఆస్పత్రి

నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలోని రూ. 100 కోట్లతో 500 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఎన్నారై ఒకరు ముందుకొచ్చారు. పెదకాకాని మండలం నంబూరు వద్ద 500 పడకల ఆసపత్రిని నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలోని డల్లాస్‌ ప్రాంతంలో ఉండే ఎన్నారైలు భాగస్వాములుగా ఉంటూ దీనిని రూపకల్పన చేస్తున్నారు. ఇందుకు 25 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. మొదటి విడత రూ.100 కోట్లతో నిర్మాణం చేపట్టి ఆ తర్వాత దశలవారీగా దాన్ని విస్తరించనున్నారు. తానా మాజీ అధ్యక్షుడు డల్లాస్‌కు చెందిన […]

రూ.100 కోట్లతో 500 పడకల ఎన్నారై ఆస్పత్రి
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలోని రూ. 100 కోట్లతో 500 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఎన్నారై ఒకరు ముందుకొచ్చారు. పెదకాకాని మండలం నంబూరు వద్ద 500 పడకల ఆసపత్రిని నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలోని డల్లాస్‌ ప్రాంతంలో ఉండే ఎన్నారైలు భాగస్వాములుగా ఉంటూ దీనిని రూపకల్పన చేస్తున్నారు. ఇందుకు 25 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. మొదటి విడత రూ.100 కోట్లతో నిర్మాణం చేపట్టి ఆ తర్వాత దశలవారీగా దాన్ని విస్తరించనున్నారు. తానా మాజీ అధ్యక్షుడు డల్లాస్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ జీ నవనీతకృష్ణ ఆధ్వర్యంలో దీనికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే డాక్టర్‌ నవనీత కృష్ణ పెదకాకాని, నంబూరు ప్రాంతాల్లో పర్యటించి 500 పడకల ఆసుపత్రికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆసుపత్రికి భాగస్వాములు, పెట్టుబడుల కోసం డల్లాస్‌ ప్రాంతంలో ఎన్నారైలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మంగళగిరి వద్ద ఎన్నారై మెడికల్‌ కాలేజి, ఆసుపత్రి ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని డల్లాస్‌ ఎన్నారైలు, నాగార్జున యూనివర్సిటీ – పెదకాకాని మధ్య జాతీయ రహదారికి తూర్పు వైపున నంబూరు ఊళ్లోకి వెళ్లే రోడ్డులో దీనిని నిర్మించేందుకు నిర్ణయించారు.
First Published:  31 Aug 2015 12:15 PM IST
Next Story