ఎన్టీఆర్ సినిమాకు లండన్ లో భారీ సెట్
సాధారణంగా విదేశాల్లో షూటింగులు పెట్టుకున్నప్పుడు అక్కడున్న అందమైన లొకేషన్లలో పనికానిచ్చేస్తారు. మ్యాగ్జిమమ్ పాటలతో పాటు కథకు తగ్గట్టు అవసరం అనుకుంటే కొన్ని సీన్లు కూడా అక్కడే రెడీమేడ్ గా తీసేస్తారు. విదేశాలకు వెళ్లి అక్కడ సెట్ వేసి షూటింగ్ చేయాలని ఎవరూ అనుకోరు. కానీ సుకుమార్ అనుకున్నాడు. ఎన్టీఆర్ సినిమా కోసం కొన్ని రోజులుగా లండన్ లో షూటింగ్ చేస్తున్న సుకుమార్, ఏకంగా అక్కడ ఓ భారీ సెట్ వేశాడు. దగ్గర్లోని ఓ భవంతిలోని 29వ అంతస్తులో […]
BY admin31 Aug 2015 12:30 AM IST
X
admin Updated On: 31 Aug 2015 6:03 AM IST
సాధారణంగా విదేశాల్లో షూటింగులు పెట్టుకున్నప్పుడు అక్కడున్న అందమైన లొకేషన్లలో పనికానిచ్చేస్తారు. మ్యాగ్జిమమ్ పాటలతో పాటు కథకు తగ్గట్టు అవసరం అనుకుంటే కొన్ని సీన్లు కూడా అక్కడే రెడీమేడ్ గా తీసేస్తారు. విదేశాలకు వెళ్లి అక్కడ సెట్ వేసి షూటింగ్ చేయాలని ఎవరూ అనుకోరు. కానీ సుకుమార్ అనుకున్నాడు. ఎన్టీఆర్ సినిమా కోసం కొన్ని రోజులుగా లండన్ లో షూటింగ్ చేస్తున్న సుకుమార్, ఏకంగా అక్కడ ఓ భారీ సెట్ వేశాడు. దగ్గర్లోని ఓ భవంతిలోని 29వ అంతస్తులో ఓ భారీ ఆఫీస్ సెట్ వేయించాడు సుకుమార్. ఆర్ట్ డైరక్టర్ రవీంద్రన్ ఆధ్వర్యంలో, లండన్ ఫిలిం ఛాంబర్ సహకారంతో ఈ సెట్ రూపుదిద్దుకుంది. జగపతిబాబు ఆఫీస్ గా ఈ సెట్ ను సినిమాలో పరిచయం చేయబోతున్నారు. ఇందులో జగపతిబాబు, ఎన్టీఆర్ మధ్య ఇంటర్వెల్ కు ముందొచ్చే కీలకమైన సన్నివేశాలు తీస్తారని తెలుస్తోంది. సినిమాకు చాలా కీలకమైన సన్నివేశాలు కాబట్టే.. ఖర్చుకు వెనకాడకుండా విదేశాల్లో సైతం సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తారక్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు.
Next Story