Telugu Global
Cinema & Entertainment

దిమ్మతిరిగే రికార్డులు సృష్టిస్తున్న అఖిల్

అఖిల్ సినిమా రోజుకో వార్తతో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకొచ్చింది. ఇది అలాంటిలాంటి న్యూస్ కాదు. రిలీజ్ కు ముందే అఖిల్ స్టామినాను ఇండస్ట్రీకి చాటిన న్యూస్. అవును.. సిసింద్రీ ఫస్ట్ మూవీ అఖిల్, విడుదలకు ముందే 45 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. వివరాలు బయటకురానప్పటికీ.. ఈ సినిమా హోల్ సేల్ రైట్స్ ను ఇప్పటికే 45 కోట్ల రూపాయలకు అమ్మేశారని తెలుస్తోంది. అక్కినేని హీరోలంతా […]

దిమ్మతిరిగే రికార్డులు సృష్టిస్తున్న అఖిల్
X
అఖిల్ సినిమా రోజుకో వార్తతో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకొచ్చింది. ఇది అలాంటిలాంటి న్యూస్ కాదు. రిలీజ్ కు ముందే అఖిల్ స్టామినాను ఇండస్ట్రీకి చాటిన న్యూస్. అవును.. సిసింద్రీ ఫస్ట్ మూవీ అఖిల్, విడుదలకు ముందే 45 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. వివరాలు బయటకురానప్పటికీ.. ఈ సినిమా హోల్ సేల్ రైట్స్ ను ఇప్పటికే 45 కోట్ల రూపాయలకు అమ్మేశారని తెలుస్తోంది. అక్కినేని హీరోలంతా కలిసి చేసిన మనం సినిమా కూడా విడుదలకు ముందు ఇంత బిజినెస్ చేయలేదు. ఆ మూవీ జస్ట్ 40కోట్ల రూపాయలు మాత్రం బిజినెస్ చేసింది. కానీ అఖిల్ ఒక్కడే తన తొలి సినిమాతోనే 45 కోట్ల రూపాయల బిజినెస్ చేశాడంటే.. సిసింద్రీ స్టామినాను అర్థం చేసుకోవచ్చు. సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకుడు. నితిన్-నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్-అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత అఖిల్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
Akhil Gallery
[gmedia id=1787]
First Published:  31 Aug 2015 12:33 AM IST
Next Story