Telugu Global
Others

Wonder World 11

శునకాలకూ అవయవముద్రలు! మనుషులలో ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒక్కటి కానట్లే కుక్కల్లోనూ ఒక ప్రత్యేకమైన అవయవ ముద్ర వాటిని ప్రత్యేకంగా ఉంచుతుందట. అదేమిటంటే శునకాల నాసికా రంధ్రాల మధ్య భాగంలో ఈ ప్రత్యేక ముద్ర ఉంటుందట. అలా నాసికా ముద్ర సాయంతో శునకాలను గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ———————————————————————————————— డెన్మార్క్‌ తరహా మర్యాద! డెన్మార్క్‌ వాసులు చాలా మర్యాదస్తులు. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు విమానాశ్రయాల వెలుపల వారు చాలా మర్యాదగా నవ్వుతూ స్వాగతం చెబుతారు. […]

Wonder World 11
X

శునకాలకూ అవయవముద్రలు!

sad dog copy
మనుషులలో ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒక్కటి కానట్లే కుక్కల్లోనూ ఒక ప్రత్యేకమైన అవయవ ముద్ర వాటిని ప్రత్యేకంగా ఉంచుతుందట. అదేమిటంటే శునకాల నాసికా రంధ్రాల మధ్య భాగంలో ఈ ప్రత్యేక ముద్ర ఉంటుందట. అలా నాసికా ముద్ర సాయంతో శునకాలను గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
————————————————————————————————
డెన్మార్క్‌ తరహా మర్యాద!

denmark
డెన్మార్క్‌ వాసులు చాలా మర్యాదస్తులు. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు విమానాశ్రయాల వెలుపల వారు చాలా మర్యాదగా నవ్వుతూ స్వాగతం చెబుతారు. తమ దేశ జెండాలను ఊపుతూ ఆహ్వానిస్తారు. అందుకే డెన్మార్క్‌కు ”ప్రపంచంలోనే అత్యంత సంతోషదాయక దేశం”గా పేరు.
————————————————————————————————
హార్లే బైకులపై ఆడాళ్లు రయ్‌ రయ్‌….!!

harrly copy
మహిళలు అన్నిరంగాలలోనూ విజయాలు సాధించడం, ఎందులోనూ పురుషుల కన్నా తాము తక్కువ కాదని నిరూపించుకోవడం పాత విషయాలే. అయితే ఢిల్లీ మహిళలు ఒక అడుగు ముందుకేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ద్విచక్ర వాహనాలను వదిలేసి బాగా బరువుండే హార్లీ డేవిడ్‌సన్‌ బైకులను ఇష్టపడు తున్నారు. ఈ రకం బైకులు బరువులోనే కాదు ఖరీదులోనూ బరువైనవే. హార్లే బైకులపై సవారీ అంటే మహిళలు ఎక్కువ ఇష్టపడుతున్నారని ఇటీవల ఒక సర్వేలో తేలింది. విచిత్రమేమిటంటే సవారీ అంటే వెనక కూర్చోని ఎంజాయ్‌ చేయడమనుకుంటున్నారేమో… అదేమీ కాదండీ హార్లే బైకులను నడపడానికే మహిళలు మోజు పడుతున్నారట. 2009లో భారత్‌లో ప్రవేశించిన హార్లే బైకులు కుర్రకారు కలల సవారీ వాహనాలు. వీటిని ఒక్క సారైనా నడపాలని టీనేజర్లు ముచ్చటపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. హార్లే డేవిడ్‌సన్‌ బైకుపై హాలీవుడ్‌ హీరో ఆర్నాల్డ్‌ షార్జ్‌నెగ్గర్‌ రయ్‌మని దూసుకుపోయే చిత్రాలకు ఎక్కడ లేని క్రేజు ఉంది. ఆ పోస్టర్లు బ్యాచిలర్‌ రూముల్లో తప్పనిసరి.

First Published:  29 Aug 2015 6:34 PM IST
Next Story