Telugu Global
NEWS

దారి తప్పుతున్న రిజర్వేషన్లు: వెంకయ్య

వివక్ష, అణిచివేతకు గురైన వర్గాలను మిగతా సమాజంతో కలిపేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్లు దారి తప్పుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. నేడు రిజర్వేషన్లు ఒక రాజకీయ ఆయుధంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి భారత రాజకీయ వ్యవస్థలోకి కుల, మత, ప్రాంతీయ, భాషా రాజకీయాలు ప్రవేశించాయన్నారు.  ఇప్పటి వరకూ ప్రభుత్వాలు కేవలం సంక్షేమాన్నే అమలు చేశాయని, ప్రధాని మోదీ సంక్షేమంతోపాటు సంరక్షణ, సామాజిక భద్రత కోసం అనేక బీమా పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. తాను […]

దారి తప్పుతున్న రిజర్వేషన్లు: వెంకయ్య
X
వివక్ష, అణిచివేతకు గురైన వర్గాలను మిగతా సమాజంతో కలిపేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్లు దారి తప్పుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. నేడు రిజర్వేషన్లు ఒక రాజకీయ ఆయుధంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి భారత రాజకీయ వ్యవస్థలోకి కుల, మత, ప్రాంతీయ, భాషా రాజకీయాలు ప్రవేశించాయన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వాలు కేవలం సంక్షేమాన్నే అమలు చేశాయని, ప్రధాని మోదీ సంక్షేమంతోపాటు సంరక్షణ, సామాజిక భద్రత కోసం అనేక బీమా పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. తాను కూడా నెల్లూరులో 10 వేల మంది మహిళలకు సొంత డబ్బులతో ప్రధాని బీమా యోజన పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు.
First Published:  30 Aug 2015 8:55 AM IST
Next Story