టీఆర్ఎస్ శ్రేణుల్లో చీప్‌లిక్కర్ గుబులు
రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నూతన మద్యం విధానంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం పట్ల గ్రామాల్లోని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంపై కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా మారింది. ప్రజల ఆయుష్షు పెంచేందుకు చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల పట్ల మారుమూల గ్రామాల్లో కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో గ్రామాల్లో అడుగు పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వెనకడుగు వేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి చెప్పలేక వారు తంటాలు పడుతున్నారు. దీంతో తమ […]
రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నూతన మద్యం విధానంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం పట్ల గ్రామాల్లోని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంపై కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా మారింది. ప్రజల ఆయుష్షు పెంచేందుకు చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల పట్ల మారుమూల గ్రామాల్లో కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో గ్రామాల్లో అడుగు పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వెనకడుగు వేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి చెప్పలేక వారు తంటాలు పడుతున్నారు. దీంతో తమ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిగా తయారైందని పార్టీ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.