రిజర్వేషన్ల పటేల్ అసలు ఉద్దేశ్యం!
పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళనలు సాగిస్తున్న యువనేత హార్దిక్ పటేల్ అసలు గళం బయటపడింది. దేశాన్ని రిజర్వేషన్ల నుంచి బయటపడేయండి లేదా అందరికీ వర్తింపజేయండి అనేదే అతని అసలు లక్ష్యం అని వెల్లడైంది. ఈ రెంటిలో దేనికైనా ప్రభుత్వం అంగీకరించినప్పుడే పటేల్‌లకు రిజర్వేషన్లు కోరుతూ తాను చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు ముగింపు పలుకుతానని ఆయన ప్రకటించారు. రిజర్వేషన్ విధానం వల్ల 80-90 శాతం మార్కులు సంపాదించినా తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉద్యోగాలు లభించడం లేదని, […]
BY Pragnadhar Reddy30 Aug 2015 12:52 AM IST
X
Pragnadhar Reddy Updated On: 30 Aug 2015 2:55 AM IST
పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళనలు సాగిస్తున్న యువనేత హార్దిక్ పటేల్ అసలు గళం బయటపడింది. దేశాన్ని రిజర్వేషన్ల నుంచి బయటపడేయండి లేదా అందరికీ వర్తింపజేయండి అనేదే అతని అసలు లక్ష్యం అని వెల్లడైంది. ఈ రెంటిలో దేనికైనా ప్రభుత్వం అంగీకరించినప్పుడే పటేల్‌లకు రిజర్వేషన్లు కోరుతూ తాను చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు ముగింపు పలుకుతానని ఆయన ప్రకటించారు. రిజర్వేషన్ విధానం వల్ల 80-90 శాతం మార్కులు సంపాదించినా తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉద్యోగాలు లభించడం లేదని, దాంతో వారు తమ సొంత వ్యాపారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు ఉండడంతో జనరల్ కోటాలో కూడా వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. దేశ రాజకీయాలను, వ్యవస్థను మార్చడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. సామాజిక వెనుకబాటు తనం కాకుండా ఆర్థిక వెనుకబాటును ఆధారం చేసుకుని రిజర్వేషన్లు ఉండాలని పటేల్ చెప్పారు. తనకు సర్దార్ వల్లభాయ్ పటేల్, బాల్‌ఠాక్రేలు తనకు ఆదర్శనీయులని హార్దిక్ పటేల్ తెలిపారు.
పోలీసుల తప్పిదం వల్లే హింస
రెండునెలలుగా చేపట్టిన ఆందోళనలు చివరికి హింసాత్మకంగా మారి తొమ్మిది మందిని బలి తీసుకున్న నేపథ్యంలో మీరు తీసుకునే తదుపరి చర్య ఏమిటన్న ప్రశ్నకు, తనకు 70 లక్షల మంది పటేళ్ల మద్దతు ఉందని, తాము బ్యాంకుల నుంచి డబ్బు వెనక్కు తీసేసుకుంటామని, పాలు-కూరగాయల సరఫరాను ఆపేస్తామని, ఇంకా చాలా చేయగలమన్నారు. తమ ఆందోళన హింసాత్మగా మారడానికి పోలీసుల తప్పిదాలే కారణమని ఆరోపించారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా తమ వారిని కొట్టారని, తమ స్త్రీలను అవమానించి కొట్టారన్నారు. దీన్ని రెండో జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చారు. రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారడం… ఈ నేపథ్యంలో శ్వేతాంగ్ పటేల్ కస్టడీ మరణం చోటుచేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ హైకోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిందని, పోలీసులకు చీవాట్లు పెట్టిందని ఆయన అన్నారు. 22 ఏళ్ల శ్వేతాంగ్‌ను ఇంటి నుంచి లాక్కుపోయి చంపేయడం పోలీసుల పాశవిక చర్యని అన్నారు.
Next Story