టీ.అర్చకుల సంక్షేమనిధి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఉధృతరూపం దాల్చడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. రూ. 71.72 కోట్లతో అర్చకుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎండోమెంట్ సిబ్బందికి కుటుంబ అవసరాల కోసం రుణ సదుపాయం లభించనుంది. ఉమ్మడి రాష్ట్రం సమయంలో ఈ సంక్షేమనిధి ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం రెండు ప్రభుత్వాలు విడివిడిగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే, టీ-ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదు. దీంతో దేవాదాయ […]

తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఉధృతరూపం దాల్చడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. రూ. 71.72 కోట్లతో అర్చకుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎండోమెంట్ సిబ్బందికి కుటుంబ అవసరాల కోసం రుణ సదుపాయం లభించనుంది. ఉమ్మడి రాష్ట్రం సమయంలో ఈ సంక్షేమనిధి ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం రెండు ప్రభుత్వాలు విడివిడిగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే, టీ-ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదు. దీంతో దేవాదాయ సిబ్బందికి రుణ సౌకర్యం లభించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. దీంతో ఉమ్మడి ట్రస్టు నుంచి వచ్చిన సొమ్ముతోపాటు సంవత్సరం నుంచి దేవాలయాల నుంచి వసూలైన సొమ్ముతో కలిపి రూ.71.72 కోట్లతో సంక్షేమనిధిని ఏర్పాటు చేసింది.