Telugu Global
Others

మోడీ చేసేది తక్కువ... చెప్పుకునేది ఎక్కువ: సోనియా

మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయినా ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదని, చేసిన వాటికంటే.. ప్రచారమే ఎక్కువగా ఉందని అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ‘స్వాభిమాన్ ర్యాలీ’లో సోనియా గాంధీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జేడీయూ అధినేత శరద్ యాదవ్, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్, ఎస్పీ నేత శివపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం కన్నా […]

మోడీ చేసేది తక్కువ... చెప్పుకునేది ఎక్కువ: సోనియా
X

మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయినా ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదని, చేసిన వాటికంటే.. ప్రచారమే ఎక్కువగా ఉందని అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ‘స్వాభిమాన్ ర్యాలీ’లో సోనియా గాంధీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జేడీయూ అధినేత శరద్ యాదవ్, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్, ఎస్పీ నేత శివపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం కన్నా తమ పార్టీ సారధ్యంలోని యూపీఏ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని సోనియా చెప్పారు. ఎన్నికల వేళ మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, ప్రజలను అంచనాలను మోదీ ప్రభుత్వ అందుకోలేకపోతోందని దుయ్యబట్టారు. అంతేకాకుండా ప్రజలకు ఎంతగానో మేలు చేసే ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ’ వంటి ముఖ్య పథకాలకు భారీగా నిధుల కోత విధిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, నితీశ్ కుమార్‌నుద్దేశించి చేసిన డీఎన్ఏ వ్యాఖ్యలపై స్పందించిన సోనియా.. బీహార్‌లో మోదీ ప్రవర్తన చూస్తుంటే ఆ రాష్ట్ర ప్రజలు జీవితాల్లో చీకట్లు అలముకుంటున్నట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

First Published:  30 Aug 2015 2:23 PM IST
Next Story