ఐఎస్ఐఎస్‌పై నిషేధం విధించిన పాక్
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించడంతో పాక్ కూడా అదే వైఖరిని అనుసరిస్తోంది. తమ దేశంలో ఐఎస్ఐఎస్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు పాక్ హోంశాఖ ప్రకటించింది. విదేశాంగ శాఖ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఆల్‌ఖైదా బలహీనపడుతున్న నేపథ్యంలో పలు దేశాల్లో ఐఎస్ఐఎస్ తన కార్యకలపాలను విస్తరించింది. పాక్ గిరిజన ప్రాంతాల్లో ఈ ఉగ్రవాద సంస్థ బలపడుతున్నట్లు ఆ దేశం భావిస్తోంది. దీంతో ఆ సంస్థపై నిషేధం ప్రకటించింది.