Telugu Global
Others

గుడుంబాను తరిమేస్తాం: నాయని

ప్రజల యోగక్షేమాల దృష్ట్యా ప్రభుత్వం గుడుంబాను తెలంగాణ నుంచి తరిమేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హోం మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చీప్‌లిక్కర్ తేవాలని ఆలోచిస్తున్నామని, చీప్‌లిక్కర్‌పై అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని, ప్రజల ఇష్టం మేరకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. చీప్‌లిక్కర్‌పై పునరాలోచిస్తున్నాం. దీనిపై క్యాబినేట్‌లో చర్చిస్తాం అని హోంమంత్రి నాయిని స్పష్టంచేశారు. హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో గుడుంబా మరణాలు పెరిగి చిన్నవయస్సులో […]

ప్రజల యోగక్షేమాల దృష్ట్యా ప్రభుత్వం గుడుంబాను తెలంగాణ నుంచి తరిమేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హోం మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చీప్‌లిక్కర్ తేవాలని ఆలోచిస్తున్నామని, చీప్‌లిక్కర్‌పై అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని, ప్రజల ఇష్టం మేరకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. చీప్‌లిక్కర్‌పై పునరాలోచిస్తున్నాం. దీనిపై క్యాబినేట్‌లో చర్చిస్తాం అని హోంమంత్రి నాయిని స్పష్టంచేశారు. హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో గుడుంబా మరణాలు పెరిగి చిన్నవయస్సులో మహిళలు వితంతువులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని చూసి సమాజ హితం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుడుంబాపై నిషేధం విధించాలని నిర్ణయించిందన్నారు.

First Published:  29 Aug 2015 6:37 PM IST
Next Story