Telugu Global
NEWS

రూ. 1268 కోట్లకు గ్లోబల్‌ ఆస్పత్రి అమ్మేశారు!

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న వైద్య సేవల సంస్థ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ను దాదాపు అమ్మేశారు. అపోలో, కాంటినెంటల్‌ హాస్పటల్స్‌లో ఇప్పటికే కాలుమోపిన ఓ మలేషియా కంపెనీ ఇపుడు 1268 కోట్లకు గ్లోబల్‌ ఆస్పత్రిలో 73.4 శాతం వాటాను సొంతం చేసుకుంది. మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బెర్హాద్‌ ఈ ఆస్పత్రిని కొనుగోలు చేసింది. గ్లోబల్‌ హాస్పిటల్స్‌కు హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు, చెన్నైలో మొత్తం ఐదు ఆస్పత్రులున్నాయి. సామర్ధ్యానికి పడకల ప్రాతిపదికగా భావించే ఈ ఐదు ఆస్పత్రుల్లో మొత్తం 1,100 […]

రూ. 1268 కోట్లకు గ్లోబల్‌ ఆస్పత్రి అమ్మేశారు!
X
హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న వైద్య సేవల సంస్థ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ను దాదాపు అమ్మేశారు. అపోలో, కాంటినెంటల్‌ హాస్పటల్స్‌లో ఇప్పటికే కాలుమోపిన ఓ మలేషియా కంపెనీ ఇపుడు 1268 కోట్లకు గ్లోబల్‌ ఆస్పత్రిలో 73.4 శాతం వాటాను సొంతం చేసుకుంది. మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బెర్హాద్‌ ఈ ఆస్పత్రిని కొనుగోలు చేసింది. గ్లోబల్‌ హాస్పిటల్స్‌కు హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు, చెన్నైలో మొత్తం ఐదు ఆస్పత్రులున్నాయి. సామర్ధ్యానికి పడకల ప్రాతిపదికగా భావించే ఈ ఐదు ఆస్పత్రుల్లో మొత్తం 1,100 పడకలున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఈ సామర్ధ్యాన్ని 1,900 పడకలకు పెంచే లక్ష్యంతో ఐహెచ్‌హెచ్‌ ఉన్నట్టు డీల్‌ గురించి వెల్లడిస్తూ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిఇఒ టాన్‌ సీ లెంగ్‌ చెప్పారు. ఆస్పత్రుల విస్తరణ, రుణభారం తగ్గించుకోవడం కోసం రానున్న రోజుల్లో 16.9 కోట్ల రింగెట్స్‌ (రూ.253 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ డీల్‌కు సిఐఎంబి సెక్యూరిటీస్‌, ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌గా వ్యవహరించాయి. ఈ డీల్‌కు సంబంధించిన చర్చలు చాలా రోజులుగా జరుగుతున్నాయి. ఈ అమ్మకానికి సంబంధించి సంతకాలు కూడా జరిగిపోయాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులకు డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో కోట్ల రూపాయలను వెదజల్లి కొత్తగా ఆస్పత్రులను పెట్టడం కంటే భారీ ప్రీమియంతో బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న ఆస్పత్రులను కొనుగోలు చేసేందుకు ఇపుడు అందరూ మొగ్గు చూపిస్తున్నారు. ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ ఇప్ప టికే అపోలో హాస్పిటల్స్‌నూ 10.85 శాతం వాటాను సొంతం చేసుకుంది. కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను 280 కోట్ల రూపాయలతో కొద్ది నెలల క్రితమే కొనుగోలు చేసింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ దుర్బలం కావడంతో విదేశీ ఇన్వెస్టర్లు మరింత ఉత్సాహంగా వైద్యరంగంలో తమ పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
First Published:  30 Aug 2015 1:44 AM GMT
Next Story