ఏడు కిలోల బంగారం కోసం డ్రైవర్ హత్య
దుండుగులు ఏడు కేజీల బంగారం కోసం వ్యాన్ డ్రైవర్‌ను హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీక్వెల్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కొరియర్ వ్యాన్ లక్నో-కాన్పూర్ జాతీయ రహదారిపై వెళుతుండగా, కొంతమంది దుండుగులు బజ్‌హెరా గ్రామం వద్ద అడ్డుకున్నారు. దుండుగులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ హరిచంద్ యాదవ్(30), సెక్యూరిటీ గార్డులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. వ్యాన్‌లోని ఏడు కేజీల బంగారం బిస్కెట్లు, ఆభరణాలను తీసుకుని పారిపోయారు. సమాచారం […]
దుండుగులు ఏడు కేజీల బంగారం కోసం వ్యాన్ డ్రైవర్‌ను హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీక్వెల్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కొరియర్ వ్యాన్ లక్నో-కాన్పూర్ జాతీయ రహదారిపై వెళుతుండగా, కొంతమంది దుండుగులు బజ్‌హెరా గ్రామం వద్ద అడ్డుకున్నారు. దుండుగులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ హరిచంద్ యాదవ్(30), సెక్యూరిటీ గార్డులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. వ్యాన్‌లోని ఏడు కేజీల బంగారం బిస్కెట్లు, ఆభరణాలను తీసుకుని పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్, సెక్యూరిటీ గార్డును ఆస్పత్రికి తరలించగా డ్రైవర్ మరణించాడని వైద్యులు ప్రకటించారు. సెక్యూరిటీ గార్డును లక్నో ఆస్పత్రికి తరలించారు. దుండుగుల దాడి చేసి ఏడు కేజీల బంగారం బిస్కెట్లు, ఆభరణాలు, మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డులు తీసుకుపోయారని కొరియర్ సంస్థ తెలిపింది.