రావల్సిన నిధులకు ప్యాకేజీ ముసుగు: బొత్స
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి న్యాయంగా రావల్సిన నిధులను సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అంటూ మభ్య పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మరో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి పాల్గొన్నారు. ప్రధాని మోడీ బీహార్‌కు ప్రకటించిన ప్యాకేజీ అంకెల గారడీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ బట్టబయలు చేశారని ఆయన అన్నారు. దానికి రెంట్టింపు ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబునాయుడు కోరడం మరో […]
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి న్యాయంగా రావల్సిన నిధులను సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అంటూ మభ్య పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మరో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి పాల్గొన్నారు. ప్రధాని మోడీ బీహార్‌కు ప్రకటించిన ప్యాకేజీ అంకెల గారడీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ బట్టబయలు చేశారని ఆయన అన్నారు. దానికి రెంట్టింపు ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబునాయుడు కోరడం మరో అంకెల గారడీతప్ప మరొకటి కాదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు అభయం ఇచ్చిందని, అలాంటప్పుడు దాన్ని సాధించుకోవడం మానేసి ప్రత్యేక ప్యాకేజీ అంటూ దేవులాడడం టీడీపీ అవకాశ వాద ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల ప్రకారం ఏపీకి దక్కాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఉన్న లిఖిత పూర్వక హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, దాన్ని సాధించుకోవడానికి అడుక్కోవలసిన పని లేదని, డిమాండు చేసి రాబట్టుకోవచ్చని ఆయన చెప్పారు. హక్కులను సాధించుకోవడం చేతకాని చంద్రబాబు ప్రభుత్వం దీనావస్థను చూసి జాలేస్తోందని బొత్స విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్ సీపీ శనివారం చేపట్టిన బంద్‌ను ప్రజలు విజయవంతం చేశారని, భవిష్యత్‌లో కూడా వైసీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని ఆయన అన్నారు.