Wonder World 10
అంతరిక్షంలో మరణంపై అపోహలు! అంతరిక్షంలో ప్రత్యేక దుస్తులు, ఆక్సిజన్ లేకపోతే మన కనుగుడ్లు పైకి ఉబికి వచ్చేస్తాయని, మన శరీరం పేలిపోతుందని అనుకుంటుంటాం. ఎందుకంటే చాలా సినిమాలలో అలాగే చూపిస్తుంటారు. కానీ అది నిజం కాదట. ఊపిరందక పోవడంతో 15 సెకన్లలోనే ప్రాణం పోతుంది. ——————————————————————————————————– సముద్రంలో గుడ్డు పగులుతుందా? సాగరగర్భంలోకి వెళ్లి కోడిగుడ్డును పగలగొడితే ఏమవుతుంది? కోడిగుడ్డు పగలగొట్టకముందు తెల్లసొన, పచ్చసొన ఎలా ఉన్నాయో అలానే ఒకదానినొకటి అంటిపెట్టుకుని ఉంటాయట. సముద్రంలో 60 అడుగుల లోతులో ఉండే […]
అంతరిక్షంలో మరణంపై అపోహలు!
అంతరిక్షంలో ప్రత్యేక దుస్తులు, ఆక్సిజన్ లేకపోతే మన కనుగుడ్లు పైకి ఉబికి వచ్చేస్తాయని, మన శరీరం పేలిపోతుందని అనుకుంటుంటాం. ఎందుకంటే చాలా సినిమాలలో అలాగే చూపిస్తుంటారు. కానీ అది నిజం కాదట. ఊపిరందక పోవడంతో 15 సెకన్లలోనే ప్రాణం పోతుంది.
——————————————————————————————————–
సముద్రంలో గుడ్డు పగులుతుందా?
సాగరగర్భంలోకి వెళ్లి కోడిగుడ్డును పగలగొడితే ఏమవుతుంది? కోడిగుడ్డు పగలగొట్టకముందు తెల్లసొన, పచ్చసొన ఎలా ఉన్నాయో అలానే ఒకదానినొకటి అంటిపెట్టుకుని ఉంటాయట.
సముద్రంలో 60 అడుగుల లోతులో ఉండే ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.
——————————————————————————————————–
కుటుంబ కలహాలను దూరంచేసే డ్రగ్స్!
ఇది ఓ సరదా సంగతి. మాదకద్రవ్యాలు తీసుకునే దంపతుల్లో కుటుంబకలహాలు అస్సలు ఉండవట. మత్తులో మునిగిపోతే ఇక గొడవలెక్కడవుతాయనుకుంటున్నారా? మారిజువానా అనే మత్తుపదార్ధాన్ని సేవించిన దంపతులపై తొమ్మిదేళ్లపాటు అధ్యయనాలు జరిపి ఈ విషయాన్ని నిర్ధారించారు.