టీఎస్ఐపాస్ తరహాలో ఇంటి అనుమతులు
రాజధాని నగరంలో ఇంటి నిర్మాణం అనుమతుల కోసం ప్రజలు పడుతున్న కష్టాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలోని భవన నిర్మాణాలకు టీఎస్ఐపాస్ తరహాలో ఒకే ఒక్క క్లిక్ ద్వారా అన్ని అనుమతులు మంజూరు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా అన్ని శాఖల సమన్వయంతో నూతన పాలసీని రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. కొత్త విధానం […]
BY Pragnadhar Reddy28 Aug 2015 7:25 PM IST
Pragnadhar Reddy Updated On: 30 Aug 2015 2:35 AM IST
రాజధాని నగరంలో ఇంటి నిర్మాణం అనుమతుల కోసం ప్రజలు పడుతున్న కష్టాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలోని భవన నిర్మాణాలకు టీఎస్ఐపాస్ తరహాలో ఒకే ఒక్క క్లిక్ ద్వారా అన్ని అనుమతులు మంజూరు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా అన్ని శాఖల సమన్వయంతో నూతన పాలసీని రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. కొత్త విధానం ద్వారా దరఖాస్తుదారులు ఇంటి నుంచి ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని, ఇకపై అక్రమ నిర్మాణాలకు సంబంధిత అధికారినే బాధ్యులను చేస్తామని ఆయన హెచ్చరించారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ.230 కోట్లు మంజూరు చేశామని, ప్రతి ఇంటికి రెండు డస్ట్‌బిన్‌లు అందిస్తామని ఆయన అన్నారు.
Next Story