Telugu Global
NEWS

టీచర్‌ దెబ్బలకు గాయపడిన చింటు మృతి

హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో…. తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఇంటూరి చింటు(14) మృతి చెందాడు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గొడవర్రు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్ధి చింటును అదే పాఠశాలలో పని చేస్తున్న టీచర్‌ ఈనెల 10న హోంవర్క్ చేయలేదని కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన చింటును ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా… పరిస్థితి విషమించి మృతిచెందాడు. బాలుడి మెడమీద తీవ్రగాయం కావడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్చ పొందుతున్నాడు. […]

టీచర్‌ దెబ్బలకు గాయపడిన చింటు మృతి
X
హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో…. తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఇంటూరి చింటు(14) మృతి చెందాడు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గొడవర్రు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్ధి చింటును అదే పాఠశాలలో పని చేస్తున్న టీచర్‌ ఈనెల 10న హోంవర్క్ చేయలేదని కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన చింటును ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా… పరిస్థితి విషమించి మృతిచెందాడు. బాలుడి మెడమీద తీవ్రగాయం కావడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్చ పొందుతున్నాడు. అయితే బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. చింటూ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న మనవడు చనిపోవడంతో చింటు తాత అల్లాడిపోతున్నాడు. మంచి చదువులు చెప్పించి డాక్టరును చేద్దమనుకుంటే వైద్యాశాలలోనే చనిపోయాడని వాపోతున్నాడు.. 15 రోజుల నుండి కుటుంబ అంతా ఆస్పత్రిలోనే ఉన్నా పిల్లాడ్ని దక్కించుకోలేక పోయామని బోరున విలపించారు.
First Published:  29 Aug 2015 4:03 AM IST
Next Story