సానియాకు ఖేల్‌రత్న ప్రదానం
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లో శనివారం క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సానియాతోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్రపతి చేతులు మీదుగా పురస్కారాలు అందుకున్నారు. అయితే, సానియాకు ఖేల్‌రత్న ప్రకటించడంపై కేంద్రానికి, సానియాకు కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, అవార్డుల ప్రదానంపై ఈ నోటీసుల ప్రభావం ఉండదని […]
BY Pragnadhar Reddy29 Aug 2015 5:33 PM IST
X
Pragnadhar Reddy Updated On: 29 Aug 2015 5:33 PM IST
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లో శనివారం క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సానియాతోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్రపతి చేతులు మీదుగా పురస్కారాలు అందుకున్నారు. అయితే, సానియాకు ఖేల్‌రత్న ప్రకటించడంపై కేంద్రానికి, సానియాకు కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, అవార్డుల ప్రదానంపై ఈ నోటీసుల ప్రభావం ఉండదని స్పష్టం చేయడంతో అవార్డును ప్రదానం చేశారు. కేంద్రానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు అందిన మాట నిజమేనని ధ్రువీకరించిన ఆ అధికారి.. నిర్ణీత గడువు 15 రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. సానియాకు ఖేల్‌రత్న ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ పారా ఒలింపియన్ గిరీశ దాఖలు చేసిన పిటిషన్‌తో కర్ణాటక హైకోర్టు జస్టిస్ బోపన్న నోటీసులు జారీ చేశారు.
Next Story