Telugu Global
NEWS

ఏపీ సర్కార్‌ది రియల్ ఎస్టేట్ బుద్ధి: లోక్‌సత్తా

ఏపీ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే 33 వేల ఎకరాల భూమిని సేకరించినందున ఇంకా రైతులను వేధించటం మంచిదికాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5 వేల ఎకరాల భూమి సరిపోతుందని అన్నారు. రియల్ ఎస్టేట్ బుద్ధిని ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మార్చుకోవాలన్నారు. పరిశ్రమలకు పన్ను రాయితీల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం జీఆర్‌డీఏ వరకు మాత్రమే అడుగుతున్నదని, మిగిలిన వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం, రాయలసీమ, ఉత్తర […]

ఏపీ సర్కార్‌ది రియల్ ఎస్టేట్ బుద్ధి: లోక్‌సత్తా
X
ఏపీ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే 33 వేల ఎకరాల భూమిని సేకరించినందున ఇంకా రైతులను వేధించటం మంచిదికాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5 వేల ఎకరాల భూమి సరిపోతుందని అన్నారు. రియల్ ఎస్టేట్ బుద్ధిని ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మార్చుకోవాలన్నారు. పరిశ్రమలకు పన్ను రాయితీల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం జీఆర్‌డీఏ వరకు మాత్రమే అడుగుతున్నదని, మిగిలిన వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం, రాయలసీమ, ఉత్తర కోస్తా ఏమైపోవాలని జేపీ ప్రశ్నించారు. అంతా ఒకేచోట కేంద్రీకరించి హైదరాబాద్‌లో చేసిన తప్పునే మళ్లీ చేయకూడదని ఓ ప్రకటనలో కోరారు. అవసరం మేరకు భూమిని సేకరిస్తే బాగుంటుంది కానీ… అదేపనిగా వేలకు వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం మానుకోవాలని సూచించారు. చిన్న రైతులను కొల్లగొట్టి సంపన్న అనుచర బృందానికి భూములను కట్టబెట్టడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదని హితవు పలికారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించి, రాష్ట్రం అభివృద్ధి చెందేలా లోక్‌సత్తా పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి పోరాటం చేస్తుందని జయప్రకాశ్ తెలిపారు.
First Published:  29 Aug 2015 7:19 AM IST
Next Story