Telugu Global
Others

ముగిసిన ష‌ర్మిల ప‌రామ‌ర్శ‌యాత్ర 

వ‌రంగ‌ల్ జిల్లాలో ష‌ర్మిల చేప‌ట్టిన మొద‌టి విడ‌త ప‌రామ‌ర్శ‌యాత్ర ముగిసింది. ప‌ర్య‌ట‌న ఆఖ‌రి రోజున ఆమె 4 కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. ప‌రామ‌ర్శకు వెళ్లిన ప్ర‌తి ఊరిలోనూ ప్ర‌జ‌లు ష‌ర్మిల‌ను సాద‌రంగా ఆహ్వానించారు. జ‌న హృద‌య‌నేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ్ఞాప‌కాల‌ను ఆమెతో పంచుకున్నారు. వైఎస్ తిరిగి రాని లోకాల‌కు త‌ర‌లి వెళ్లినా త‌మ గుండెల్లో శాశ్వ‌తంగా కొలువై ఉన్నాడ‌ని చెప్పారు. ష‌ర్మిల‌ను చూడ‌డంతో వైఎస్ మ‌ర‌ణించాడ‌న్న‌ దిగులు తీరింద‌ని వారు అన్నారు. ఈ […]

వ‌రంగ‌ల్ జిల్లాలో ష‌ర్మిల చేప‌ట్టిన మొద‌టి విడ‌త ప‌రామ‌ర్శ‌యాత్ర ముగిసింది. ప‌ర్య‌ట‌న ఆఖ‌రి రోజున ఆమె 4 కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. ప‌రామ‌ర్శకు వెళ్లిన ప్ర‌తి ఊరిలోనూ ప్ర‌జ‌లు ష‌ర్మిల‌ను సాద‌రంగా ఆహ్వానించారు. జ‌న హృద‌య‌నేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ్ఞాప‌కాల‌ను ఆమెతో పంచుకున్నారు. వైఎస్ తిరిగి రాని లోకాల‌కు త‌ర‌లి వెళ్లినా త‌మ గుండెల్లో శాశ్వ‌తంగా కొలువై ఉన్నాడ‌ని చెప్పారు. ష‌ర్మిల‌ను చూడ‌డంతో వైఎస్ మ‌ర‌ణించాడ‌న్న‌ దిగులు తీరింద‌ని వారు అన్నారు. ఈ యాత్ర‌లో ష‌ర్మిల వెంట వైఎస్సార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, ఇత‌ర నేతలు ఉన్నారు.

First Published:  28 Aug 2015 7:24 PM IST
Next Story