చీకటి రాజ్యం రెడీ అయిపోయింది
ఓపెనింగ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఏకథాటిగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది చీకటి రాజ్యం సినిమా. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ ను రికార్డు టైమ్ లో పూర్తిచేశారు. ఒకపాట.. కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ చాలా భాగం పూర్తయింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ ట్రయిలర్ తో ప్రేక్షకులను పలకరించాలనుకుంటున్నారు కమల్ అండ్ కో. కమల్ హాసన్-త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించి త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ ట్రయిలర్ […]
BY admin28 Aug 2015 7:01 PM
X
admin Updated On: 29 Aug 2015 12:15 AM
ఓపెనింగ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఏకథాటిగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది చీకటి రాజ్యం సినిమా. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ ను రికార్డు టైమ్ లో పూర్తిచేశారు. ఒకపాట.. కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ చాలా భాగం పూర్తయింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ ట్రయిలర్ తో ప్రేక్షకులను పలకరించాలనుకుంటున్నారు కమల్ అండ్ కో. కమల్ హాసన్-త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించి త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ ట్రయిలర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఓవైపు షూటింగ్ చేస్తూనే.. మరోవైపు ట్రయిలర్ కట్ ఎడిటింగ్ తో బిజీగా ఉన్నారు కమల్ హాసన్. ఫైనల్ కట్ పూర్తయిన వెంటనే ట్రయిలర్ టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తారు. సినిమాలో తెలుగమ్మాయి మధుషాలిని, నటుడు ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో కనిపిస్తారు. కమల్ దగ్గర దర్శకత్వం విభాగంలో శిష్యరికం చేసిన రాజేశ్, ఈ సినిమాతో మెగాఫోన్ పట్టాడు.
Next Story