Telugu Global
Others

పాక్‌లో ఏడాదికి 20 అణుబాంబులు తయారీ!

అణుశక్తిని సంపాదించిన దేశాల్లో ప్రపంచంలో మూడో స్థానం ఎవరిది? పాకిస్థాన్‌దేనా? అవును… త్వరలోనే పాక్‌ మూడో స్థానంలోకి రాబోతుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ సంచలన కథనం ప్రచురించింది. దాదాపు ఏడాదికి ఇరవై అణుబాంబులు పాక్‌ తయారు చేస్తుందని ఆ కథనంలో పేర్కొన్నారు. వేల సంఖ్యలో అణుబాంబులు ఉన్న అమెరికా, రష్యాల సరసన త్వరలోనే పాక్‌ చేరబోతుందని ఈ పత్రిక తన కథనంలో చెప్పింది. భారత్‌పై దూకుడుగా ఉన్న పాకిస్థాన్‌ తన వద్ద ఉన్న అణుబాంబులను చూసుకునే మితిమీరి ప్రవర్తిస్తుందని […]

పాక్‌లో ఏడాదికి 20 అణుబాంబులు తయారీ!
X
అణుశక్తిని సంపాదించిన దేశాల్లో ప్రపంచంలో మూడో స్థానం ఎవరిది? పాకిస్థాన్‌దేనా? అవును… త్వరలోనే పాక్‌ మూడో స్థానంలోకి రాబోతుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ సంచలన కథనం ప్రచురించింది. దాదాపు ఏడాదికి ఇరవై అణుబాంబులు పాక్‌ తయారు చేస్తుందని ఆ కథనంలో పేర్కొన్నారు. వేల సంఖ్యలో అణుబాంబులు ఉన్న అమెరికా, రష్యాల సరసన త్వరలోనే పాక్‌ చేరబోతుందని ఈ పత్రిక తన కథనంలో చెప్పింది. భారత్‌పై దూకుడుగా ఉన్న పాకిస్థాన్‌ తన వద్ద ఉన్న అణుబాంబులను చూసుకునే మితిమీరి ప్రవర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో అంటున్నారు. ఈ వ్యాఖ్యలకు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం బలం చేకూరుస్తోంది.
First Published:  28 Aug 2015 11:52 AM IST
Next Story