రేపిస్టులంతా తెలిసినోళ్లే!
పసిపిల్లలు, బాలికలు, మహిళలపై రోజు రోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, అఘాయిత్యాల వెనుక భయంకరమైన నిజాలు వెల్లడయ్యాయి. విభ్రాంతికర వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. బంధువులు, ఇరుగుపొరుగువారు, బాగా తెలిసినవాళ్లే.. అత్యాచారాలకు పాల్పడుతున్నారని.. తాజా గణాంకాలు వెల్లడించాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2014 లెక్కల ప్రకారం.. అత్యాచారం కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 87 శాతం, తెలంగాణలో 71 శాతం కేసులు తెలిసినవారే నిందితులుగా ఉన్నారు. ఏపీలో 961 మంది మహిళలపై అత్యాచారాలు జరగ్గా, తెలంగాణలో 979 లైంగిక దాడి కేసులు […]
BY Pragnadhar Reddy27 Aug 2015 11:22 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 28 Aug 2015 12:17 AM GMT
పసిపిల్లలు, బాలికలు, మహిళలపై రోజు రోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, అఘాయిత్యాల వెనుక భయంకరమైన నిజాలు వెల్లడయ్యాయి. విభ్రాంతికర వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. బంధువులు, ఇరుగుపొరుగువారు, బాగా తెలిసినవాళ్లే.. అత్యాచారాలకు పాల్పడుతున్నారని.. తాజా గణాంకాలు వెల్లడించాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2014 లెక్కల ప్రకారం.. అత్యాచారం కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 87 శాతం, తెలంగాణలో 71 శాతం కేసులు తెలిసినవారే నిందితులుగా ఉన్నారు. ఏపీలో 961 మంది మహిళలపై అత్యాచారాలు జరగ్గా, తెలంగాణలో 979 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. లైంగిక దాడికి గురైన వారిలో సగానికి ఎక్కువ మంది బాలికలే ఉన్నారు.
అత్యాచార ఆంధ్రప్రదేశ్
అత్యాచారాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్‌సీఆర్‌బీ రికార్డ్‌ల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు తీవ్రంగా పెరిగాయని స్పష్టమవుతోంది. ఏపీలో సగటున రోజుకు రెండు అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014లో మొత్తం 961 అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అత్యాచార బాధితుల్లో 838 మంది (87.2) శాతం మంది నిందితులకు తెలిసినవారే కావడం ఆశ్చర్యకరమైన విషయం.
క్రైమ్ కేపిటల్ బెజవాడ
బెజవాడ పేరు వింటేనే జనం గజగజలాడిపోయేలా ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు భయపెడుతున్నాయి. విజయవాడలో మహిళలపై లైంగిక దాడులతోపాటు, గృహహింస, ఈవ్‌టీజింగ్, ప్రేమ వేధింపులు, బంధువుల వేధింపుల కేసులు అధికంగా నమోదయ్యాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. మహిళల హత్యల్లోనూ విజయవాడ ఎన్‌సీఆర్‌బీ రికార్డుల్లోకి ఎక్కి ఆందోళన కలిగిస్తోంది. 2014లో 91 మంది మహిళలను హత్య చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల తరువాత స్థానం బెజవాడదే. వరకట్నపు చావులు, మహిళలపై దాడుల్లోనూ దేశవ్యాప్తంగా బెజవాడ పేరే వినిస్తోంది. రాష్ట్రంలో విశాఖపట్నంలో అత్యధిక అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. విశాఖలో 84 కేసులు నమోదు కాగా, బాధితుల్లో 33 మంది మైనర్లు. విశాఖలో 99 శాతం కేసుల్లో తెలిసినవారే మహిళలపై అత్యాచారాలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి.కొన్ని కేసుల్లో రాజీ మార్గంలో సెటిల్ చేసుకోవడం కూడా జరుగుతోందని ఎన్‌సీఆర్‌బీ విశ్లేషిస్తోంది.
Next Story