తెలుగు వర్శిటీ ఆంధ్రా సేవల నిలిపివేతపై స్టే
తెలుగు యూనివర్శిటీ సేవలను ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు నిలిపి వేయాలని జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. గతంలో మాదిరిగానే ఏపీలోని క్యాంపస్‌లకు తన సేవలను కొనసాగించించాలని ఆదేశించింది. రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయినందున తమ సేవలను తెలంగాణకు మాత్రమే పరిమితం చేస్తున్నామని, ఒకవేళ అవసరమైతే ఆంధ్రప్రదేశ్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని తెలుగు యూనివర్శిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ కోర్టును ఆశ్రయించింది. యూనివర్శిటీ జారీ చేసిన ఉత్తర్వులు […]
తెలుగు యూనివర్శిటీ సేవలను ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు నిలిపి వేయాలని జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. గతంలో మాదిరిగానే ఏపీలోని క్యాంపస్‌లకు తన సేవలను కొనసాగించించాలని ఆదేశించింది. రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయినందున తమ సేవలను తెలంగాణకు మాత్రమే పరిమితం చేస్తున్నామని, ఒకవేళ అవసరమైతే ఆంధ్రప్రదేశ్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని తెలుగు యూనివర్శిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ కోర్టును ఆశ్రయించింది. యూనివర్శిటీ జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని వాదించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం… వర్శిటీ సేవలు కొనసాగించాలని తీర్పును వెలువరించింది. దీంతో రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం ప్రాంతాల్లో చదువుతున్న 348 మంది విద్యార్ధులకు విశ్వవిద్యాలయ సేవలు యథాతధంగా అందనున్నాయి.