ప్రత్యేక హోదా కోసం నెల్లూరులో మరో బలిదానం
ఏపీకి ప్రత్యేక హోదా కోసం బలిదానాలు పెరుగుతున్నాయి. నిన్న గోదావరి జిల్లాలో ఒకరు ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా.. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ, ఓ సూసైడ్ లెటర్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. అందులో జై ఆంధ్రప్రదేశ్… జై జై ప్రత్యేక హోదా అనే నినాదాన్ని రాశాడు. ప్రత్యేక హోదా […]
BY sarvi27 Aug 2015 9:06 AM IST
X
sarvi Updated On: 27 Aug 2015 9:12 AM IST
ఏపీకి ప్రత్యేక హోదా కోసం బలిదానాలు పెరుగుతున్నాయి. నిన్న గోదావరి జిల్లాలో ఒకరు ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా.. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ, ఓ సూసైడ్ లెటర్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. అందులో జై ఆంధ్రప్రదేశ్… జై జై ప్రత్యేక హోదా అనే నినాదాన్ని రాశాడు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని అందులో పేర్కొన్నాడు. లక్ష్మయ్య కాంట్రాక్టు ఉద్యోగి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story