ఆర్టీసీలో అద్దెబస్సుల జోరు
నష్టాల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీ సంస్థ రూ. 400 కోట్లు వెచ్చించి కొత్త బస్సులను కొనే స్థితిలో లేదు. అందువల్ల సంస్థలోని పాత బస్సుల స్థానంలో వెయ్యి ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అద్దె బస్సుల పరిమితిని కూడా 18 నుంచి 25 శాతానికి పెంచాలని నిర్ణయించారు. దీంతో సంస్థలోని అద్దె బస్సుల సంఖ్య 1,643 నుంచి 2,600లకు పెరగనుంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పదిరోజుల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోనే కొత్తగా […]
BY sarvi27 Aug 2015 8:12 AM IST
X
sarvi Updated On: 27 Aug 2015 8:12 AM IST
నష్టాల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీ సంస్థ రూ. 400 కోట్లు వెచ్చించి కొత్త బస్సులను కొనే స్థితిలో లేదు. అందువల్ల సంస్థలోని పాత బస్సుల స్థానంలో వెయ్యి ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అద్దె బస్సుల పరిమితిని కూడా 18 నుంచి 25 శాతానికి పెంచాలని నిర్ణయించారు. దీంతో సంస్థలోని అద్దె బస్సుల సంఖ్య 1,643 నుంచి 2,600లకు పెరగనుంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పదిరోజుల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోనే కొత్తగా 800 బస్సులను అద్దెకు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరో రెండేళ్ల పాటు సంస్థలో కొత్తగా ఎలాంటి పోస్టులకూ రిక్రూట్‌మెంట్ నిర్వహించరాదని వారు నిర్ణయించారు. ఉన్నతాధికారుల నిర్ణయం పట్ల కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సుల సంఖ్య పెంచడం వల్ల సంస్థకు మున్ముందు కష్టాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. అద్దె బస్సుల యాజమాన్యమే డ్రైవర్లను కూడా సమకూర్చడం వలన రెండు వేల మంది ఆర్టీసీ డ్రైవర్లకు పని కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు.
Next Story