చిరు 150వ చిత్రంలో పవన్, చెర్రి, బన్నీ?
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ చిత్రం రోజుకో ఊహాగానంతో ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికితోడు మొన్న చిరంజీవి 60వ జన్మదిన వేడుకల్లో ఫ్యామిలిలో అందరు కలసి నటిస్తే బాగుంటుందని అభిమానుల్లో చర్చ మొదలైందట. ఈ విషయం ఆనోట ఈనోట పడి చివరికి చిరంజీవి చెవికి చేరిందట. దీనిపై చిరంజీవి సానుకూలంగా స్పందించాడని, పవన్ కళ్యాణ్ కూడా సినిమా కాబట్టి అన్నయ్య మాట కాదనడన్న నమ్మకంతో చెర్రీ కథ కోసం ఆలోచిస్తున్నాడని ఫిలింనగర్‌లో ఓ టాక్ […]
BY admin27 Aug 2015 12:42 PM IST

X
admin Updated On: 28 Aug 2015 11:13 AM IST
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ చిత్రం రోజుకో ఊహాగానంతో ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికితోడు మొన్న చిరంజీవి 60వ జన్మదిన వేడుకల్లో ఫ్యామిలిలో అందరు కలసి నటిస్తే బాగుంటుందని అభిమానుల్లో చర్చ మొదలైందట. ఈ విషయం ఆనోట ఈనోట పడి చివరికి చిరంజీవి చెవికి చేరిందట. దీనిపై చిరంజీవి సానుకూలంగా స్పందించాడని, పవన్ కళ్యాణ్ కూడా సినిమా కాబట్టి అన్నయ్య మాట కాదనడన్న నమ్మకంతో చెర్రీ కథ కోసం ఆలోచిస్తున్నాడని ఫిలింనగర్‌లో ఓ టాక్ నడుస్తున్నది. ఎలాగు రామ్‌చరణ్ సొంతంగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభిస్తుండంతో ఆ నిర్మాణ సంస్థకు… ‘కొణిదెల’ పేరు కలిసొచ్చేలా… చిరంజీవి ఆరాధ్యదైవం హనుమంతుడి బొమ్మతో ఓ బ్యానర్ లోగోను డిజైన్ చేస్తున్నారట. దీనితోపాటు చిరు 150వ సినిమా కోసం మన టాలీవుడ్ రైటర్స్ కూడా చాలామంది కథలు సిద్ధం చేస్తున్నారనే విషయం తెలిసిందే. మరి వీటిలో ఏ స్టోరీ సెట్స్ పైకి వెళ్తుందో తెలియాలంటే.. చిరు చెప్పినట్టు మరో రెండు నెలలు ఆగాల్సిందే. ఒకవేళ ఫ్యామిలి చిత్రమే నిజమైతే చిరంజీవి, పవనకళ్యాణ్, చెర్రీ, బన్నీతో పాటు నాగబాబుని కూడా ఒకే తెర మీద చూడొచ్చని అభిమానులు సంబరపడి పోతున్నారట!
Next Story