కాళేశ్వరంపై ఆంధ్రా, పట్టిసీమపై తెలంగాణ
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి ప్రాజెక్టుల నిర్మాణాల లొల్లి ప్రారంభమైంది. ఈనెల 29న జరగబోయే గోదావరి బోర్డు సమావేశంలో వీటిని ప్రస్తావించాలని రెండు రాష్ట్రాల అధికారులు సమాయత్తమయ్యారు. ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా, తెలంగాణ చేపట్టిన కాళేశ్వరంపై ఆంధ్రా ఫిర్యాదు చేయనుంది. తమతమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రెండు ప్రభుత్వాలు ఇప్పటికే ఒకదానికొకటి లేఖలు రాసుకున్నాయి. తర్వాత అంకంగా గోదావరి ట్రిబ్యునల్ ముందు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ […]
BY sarvi26 Aug 2015 1:10 PM GMT
X
sarvi Updated On: 27 Aug 2015 6:48 AM GMT
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి ప్రాజెక్టుల నిర్మాణాల లొల్లి ప్రారంభమైంది. ఈనెల 29న జరగబోయే గోదావరి బోర్డు సమావేశంలో వీటిని ప్రస్తావించాలని రెండు రాష్ట్రాల అధికారులు సమాయత్తమయ్యారు. ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా, తెలంగాణ చేపట్టిన కాళేశ్వరంపై ఆంధ్రా ఫిర్యాదు చేయనుంది. తమతమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రెండు ప్రభుత్వాలు ఇప్పటికే ఒకదానికొకటి లేఖలు రాసుకున్నాయి. తర్వాత అంకంగా గోదావరి ట్రిబ్యునల్ ముందు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనను వినిపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
Next Story