జర నవ్వండి ప్లీజ్ 187
వయసు “మనకు పక్క గదిలో పాతిక మంది ఆడవాళ్ళున్నారు. తెగమాట్లాడుతున్నారు. వాళ్ళని పది నిముషాలు మాట్లాడకుండా మౌనంగా ఉండేలా చెయ్యగలవా!” అన్నాడు వేణు. శేఖర్ “అదెంతపని?” అని ఆడవాళ్ళ గదిలోకి వెళ్ళి వచ్చాడు. అంతా నిశ్శబ్దం. వేణు ఆశ్చర్యపోయాడు. “ఏం చేశావు?” అన్నాడు. శేఖర్ వాళ్ళ మధ్యకు వెళ్ళి “మీలో అందరికన్నా ఎక్కువ వయసు వాళ్ళు పదినిమిషాలు మాట్లాడండి అన్నాను” అన్నాడు. ———————————————————————————————- పెళ్ళి “రాము, రాధ పెళ్ళి చేసుకోబోతున్నారు తెలుసా?” “అవునా! రాధ గురించి విన్నాను. […]
వయసు
“మనకు పక్క గదిలో పాతిక మంది ఆడవాళ్ళున్నారు. తెగమాట్లాడుతున్నారు. వాళ్ళని పది నిముషాలు మాట్లాడకుండా మౌనంగా ఉండేలా చెయ్యగలవా!” అన్నాడు వేణు.
శేఖర్ “అదెంతపని?” అని ఆడవాళ్ళ గదిలోకి వెళ్ళి వచ్చాడు.
అంతా నిశ్శబ్దం. వేణు ఆశ్చర్యపోయాడు. “ఏం చేశావు?” అన్నాడు.
శేఖర్ వాళ్ళ మధ్యకు వెళ్ళి “మీలో అందరికన్నా ఎక్కువ వయసు వాళ్ళు పదినిమిషాలు మాట్లాడండి అన్నాను” అన్నాడు.
———————————————————————————————-
పెళ్ళి
“రాము, రాధ పెళ్ళి చేసుకోబోతున్నారు తెలుసా?”
“అవునా! రాధ గురించి విన్నాను. ఆమెవి ఆధునిక భావాలని ఆమెకు పెళ్ళి అంటే నమ్మకం లేదని విన్నాను”
“అవును. రామువి కూడా ఆధునిక భావాలే. అతనిక్కూడా పెళ్ళంటే నమ్మకం లేదు.
“ఇద్దరి భావాలూ కలిశాయి. అందుకే పెళ్ళి చేసుకుంటున్నారు!”
———————————————————————————————-
రహస్యం
వాణి తన ఎంగేజ్‌మెంట్‌ని సీక్రెట్‌గా పెట్టింది తెలుసా?!
“ఆ సంగతి నీకెలా తెలిసింది”
“వాణి ఆవిషయం నాతో చెప్పింది!”
———————————————————————————————-
హౌస్ ఫుల్
థియేటర్ హౌస్ ఫుల్!
అవును పూర్తిగా దోమల్తో నిండిపోయింది!