ఆస్కార్ రేస్ లో బాహుబలి!
ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ రేస్‌లో బాహుబలి సినిమా తెలుగు సినిమాల విభాగం నుండి ఎంపిక కావచ్చని ఫిలింనగర్ సమాచారం. అన్ని భాషల నుండి దాదాపు 45 సినిమాలు ఈ రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అమూల్ పాలేకర్‌ను ఈ సంవత్సరం అస్కార్ ఎంపిక బృందానికి అధ్యక్సుడిగా ఎన్నుకున్నట్టు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ తెలిపారు. అయితే బాహుబలి సినిమా బాలీవుడ్ సినిమాల్లో.. అమీర్ ఖాన్ సినిమా పీకె, అనురాగ్ కశ్యప్ సినిమా అగ్లీ, […]

ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ రేస్‌లో బాహుబలి సినిమా తెలుగు సినిమాల విభాగం నుండి ఎంపిక కావచ్చని ఫిలింనగర్ సమాచారం. అన్ని భాషల నుండి దాదాపు 45 సినిమాలు ఈ రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అమూల్ పాలేకర్‌ను ఈ సంవత్సరం అస్కార్ ఎంపిక బృందానికి అధ్యక్సుడిగా ఎన్నుకున్నట్టు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ తెలిపారు. అయితే బాహుబలి సినిమా బాలీవుడ్ సినిమాల్లో.. అమీర్ ఖాన్ సినిమా పీకె, అనురాగ్ కశ్యప్ సినిమా అగ్లీ, విశాల్ భరద్వాజ్ సినిమా హైదర్, ప్రియాంక చోప్రా సినిమా మేరి కోమ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఇతర భాషా చిత్రాలతో పోటీ పడి ఫైనల్‌కి చేరుతుందోలేదో చూడాలి!