నల్లబజారుకు కందిపప్పు తరలిస్తున్న ఎంఆర్‌ఓ
నిజామాబాద్ జిల్లాలోని బిచ్‌కుందలో రేషన్ సరుకులు నల్లబజారుకు తరలివెళ్తున్నాయి. మామూలుగా అయితే రేషన్ డీలర్లు ఇలాంటి పనులు చేస్తారు. కాని ఇక్కడ అధికారులే స్వయంగా ఈ పాప కార్యానికి పూనుకున్నారు. కందిపప్పుకు బిచుకుంద, జూకల్, మదనూరు మండలాల్లో డిమాండ్ లేదు. దీంతో నల్లబజార్‌లో కందిపప్పుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మండలి రెవెన్యూ అధికారి, గోదాం అధికారి కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారు. డీలర్లకు తెలియకుండా వారి పేర్ల మీద కందిపప్పు తెప్పించుకుని నల్లబజారుకు తరలిస్తున్నారు. ఇలా […]
BY sarvi26 Aug 2015 8:08 AM IST
X
sarvi Updated On: 26 Aug 2015 8:08 AM IST
నిజామాబాద్ జిల్లాలోని బిచ్‌కుందలో రేషన్ సరుకులు నల్లబజారుకు తరలివెళ్తున్నాయి. మామూలుగా అయితే రేషన్ డీలర్లు ఇలాంటి పనులు చేస్తారు. కాని ఇక్కడ అధికారులే స్వయంగా ఈ పాప కార్యానికి పూనుకున్నారు. కందిపప్పుకు బిచుకుంద, జూకల్, మదనూరు మండలాల్లో డిమాండ్ లేదు. దీంతో నల్లబజార్‌లో కందిపప్పుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మండలి రెవెన్యూ అధికారి, గోదాం అధికారి కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారు. డీలర్లకు తెలియకుండా వారి పేర్ల మీద కందిపప్పు తెప్పించుకుని నల్లబజారుకు తరలిస్తున్నారు. ఇలా దాదాపు 65 క్వింటాళ్ల కందిపప్పును నల్లబజార్‌కు తరలించారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Next Story