పార్లమెంటు ప్రత్యేక భేటీ సాధ్యమేనా?
జీఎస్టీతోపాటు పలు కీలక బిల్లులు పెండింగులో ఉండటంతో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. సెప్టెంబరు మొదటి పక్షంలో సమావేశాలు జరగవచ్చని విశ్వసనీయ సమచారం. పలువురు బీజేపీ మంత్రులు రాజీనామాకు కాంగ్రెస్ పట్టుబట్టి పార్లమెంటు వర్షకాల సమావేశాలు జరగనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో కీలకమైన పలు బిల్లులు ఆమోదానికి నోచుకోకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే ప్రతిపక్షాలతో సంప్రదింపులు ప్రారంభించారు. మంగళవారం లోకసభలో కాంగ్రెస్ పక్ష […]
BY sarvi26 Aug 2015 5:02 AM IST
X
sarvi Updated On: 26 Aug 2015 5:02 AM IST
జీఎస్టీతోపాటు పలు కీలక బిల్లులు పెండింగులో ఉండటంతో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. సెప్టెంబరు మొదటి పక్షంలో సమావేశాలు జరగవచ్చని విశ్వసనీయ సమచారం. పలువురు బీజేపీ మంత్రులు రాజీనామాకు కాంగ్రెస్ పట్టుబట్టి పార్లమెంటు వర్షకాల సమావేశాలు జరగనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో కీలకమైన పలు బిల్లులు ఆమోదానికి నోచుకోకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే ప్రతిపక్షాలతో సంప్రదింపులు ప్రారంభించారు. మంగళవారం లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. సమావేశాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సోనియా, రాహుల్ నూ కలుస్తాం..!
ఖర్గేతో సమావేశం అనంతరం వెంకయ్య విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ, భూసేకరణ, రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్‌లాంటి పలు బిల్లులు ఆమోదించాల్సి ఉందని, ఇందుకోసం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అవసరమైతే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతోనూ చర్చలు జరుపుతామన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలకు ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా అన్ని పార్టీలను కోరారు. బిల్లులపై ఉన్న అభ్యంతరాలను సభలో చర్చించుకుందామని సూచించారు. ప్రస్తుతం రూపాయి పతనం, దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో జీఎస్టీ బిల్లు తక్షణం ఆమోదం పొందాలని తెలిపారు. తద్వారా మాత్రమే ప్రజల ఆకాంక్షలు, నిరుద్యోగ సమస్య తీరుతాయన్నారు. అలాగే భారత జీడీపీ 1.5 నుంచి 2 శాతం పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
సమావేశాలపై కాంగ్రెస్ అనాసక్తి..!
వెంకయ్య వినతిపై ఖర్గే స్పందించారు. జీఎస్టీ బిల్లుపై బీజేపీ తీరు, బిల్లులో పొందుపరిచిన అంశాలు, దీనిపై స్థాయీసంఘం, ఇతర పార్టీల అభిప్రాయాలు పరిశీలించాక తమ అభిప్రాయం తెలుపుతామన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్‌డీఏ పార్లమెంటును సమావేశపరుస్తుందని నేననుకోవడం లేదు. అనుకున్నా.. 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి కదా! అని ఖర్గే గుర్తు చేస్తూ సమావేశాలపై ఉన్న కాంగ్రెస్ పార్టీ అనాసక్తిని వ్యక్త పరిచారు.
Next Story