చిరంజీవి దోసెకు రామ్‌చరణ్ పేటెంట్!
సాధారణంగా దోసె అంటే పలచగా ఉంటుంది. చాలామందికి పలచగా ఉండడమే ఇష్టం. కొంతమంది హోటల్‌కి వెళ్ళినప్పుడు ‘రోస్ట్…ఆయిల్ తక్కువ’ అని చెప్పిమరీ పలచగా వేయించుకుంటారు. కానీ చిరంజీవి దోసె మాత్రం మందంగా ఉంటుందట! అందులోనూ నూనె తక్కువ. దీనితోపాటు వేరుశెనగపప్పులతో చేసిన పచ్చడి, కూరగాయలతో కూటుగా చేసిన విజిటబుల్ కర్రీని వడ్డిస్తారు. పాతికేళ్ళక్రితం ఒకసారి చిరంజీవి మైసూర్‌కు షూటింగ్‌కు వెళ్ళారట. అక్కడ చిన్న హోటల్లో దోసె తిన్నారు. చాలా బాగుందనిపించింది. ఎలా తయారు చేస్తారని ఆసక్తిగా అడగగా, […]
BY admin26 Aug 2015 12:31 AM IST
X
admin Updated On: 26 Aug 2015 5:02 AM IST
సాధారణంగా దోసె అంటే పలచగా ఉంటుంది. చాలామందికి పలచగా ఉండడమే ఇష్టం. కొంతమంది హోటల్‌కి వెళ్ళినప్పుడు ‘రోస్ట్…ఆయిల్ తక్కువ’ అని చెప్పిమరీ పలచగా వేయించుకుంటారు. కానీ చిరంజీవి దోసె మాత్రం మందంగా ఉంటుందట! అందులోనూ నూనె తక్కువ. దీనితోపాటు వేరుశెనగపప్పులతో చేసిన పచ్చడి, కూరగాయలతో కూటుగా చేసిన విజిటబుల్ కర్రీని వడ్డిస్తారు. పాతికేళ్ళక్రితం ఒకసారి చిరంజీవి మైసూర్‌కు షూటింగ్‌కు వెళ్ళారట. అక్కడ చిన్న హోటల్లో దోసె తిన్నారు. చాలా బాగుందనిపించింది. ఎలా తయారు చేస్తారని ఆసక్తిగా అడగగా, ఆ ఢాబా నడిపే వ్యక్తి… ఎన్నికావాలంటే అన్నిదోసెలు ప్యాక్ చేసి ఇస్తానుగానీ ఎలా చేస్తానో చెప్పనన్నాడట. దీంతో చిరంజీవి తన ఇంట్లోని వంట మనిషితో ఆ దోశె రుచి వచ్చేలా చాలా ప్రయోగాలు చేశారట. అయినా ఫలితం దక్కలేదు. అయితే ఈ క్రమంలో మరో రుచికరమైన కొత్త దోసెను కనుక్కొన్నారట. అదే చిరంజీవి దోసె. చిరంజీవి ఇంటికి వచ్చిన రజనీకాంత్, సచిన్‌వంటి ప్రముఖ అతిథులకు ఈ దోసె అంటే చాలా ఇష్టమట. మొన్న పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన పంక్షన్‌లో ఈ దోసెను అతిథులకు వడ్డించారు. అదిరిపోయిందని అందరూ ప్రశంసించారట! ఇపుడు తెలుగు రాష్ట్రాలలో ఈ దోసెకు పేటెంట్ సంపాదించడానికి, వాణిజ్యపరంగా పాపులర్ చేయడానికి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నారు. ఎక్కువమంది తినేలా దీనిని తక్కువ ధరకే అందిస్తానని రామ్‌చరణ్ చెబుతున్నారు.
Next Story