బీపీ మండల్ సిఫార్సులు అమలు చేయాలి- ఆర్.కృష్ణయ్య
బీసీల సంక్షేమం కోసం బీపీ మండల్ (బిందేశ్వరి ప్రసాద్) చేసిన కృషి శ్లాఘనీయమని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. అయితే, 30 ఏళ్లు గడిచినా ఆయన సిఫార్సులు అమలు కాకపోవడం శోచనీయమని, ప్రభుత్వాలు వెంటనే మండల్ కమిషన్‌లోని సిఫార్సులను అమలు చేయాలని ఆయన కోరారు. బీపీ మండల్ 97వ జయంతి వేడుకులను నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, కేంద్రం కులాల వారీగా లెక్కలు […]
BY sarvi25 Aug 2015 6:45 PM IST
X
sarvi Updated On: 4 Feb 2016 5:56 AM IST
బీసీల సంక్షేమం కోసం బీపీ మండల్ (బిందేశ్వరి ప్రసాద్) చేసిన కృషి శ్లాఘనీయమని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. అయితే, 30 ఏళ్లు గడిచినా ఆయన సిఫార్సులు అమలు కాకపోవడం శోచనీయమని, ప్రభుత్వాలు వెంటనే మండల్ కమిషన్‌లోని సిఫార్సులను అమలు చేయాలని ఆయన కోరారు. బీపీ మండల్ 97వ జయంతి వేడుకులను నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, కేంద్రం కులాల వారీగా లెక్కలు ప్రకటించి బీసీల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా బీసీ ఉద్యమ వేదిక పేరుతో మరో సంస్థ ఆవిర్భవించింది. ఈ వేదికను ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాలలో మండల్ జయంతి వేడుకల్లో నేతలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల సంక్షేమానికి వేదిక కృషి చేస్తుందని అధ్యక్షుడు దేశగాని సాంబశివగౌడ్ ప్రకటించారు.
Next Story