టీచర్‌గా రాష్ట్రపతి
టీచర్స్ డే… సెప్టెంబర్ 5ను పుస్కరించుకుని ఢిల్లీలోని ఓ పాఠశాల విద్యార్థులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాఠాలు చెప్పనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సరైన సంబంధాలు నెలకొనడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఉపాధ్యాయుడుగా మారడం విశేషం. సెప్టెంబర్ నాలుగు సాయంత్రం రాష్ట్రపతి భవన్ కు సమీపంలో ఉండే సర్వోదయ విద్యాలయ పాఠశాలలో ఏడు, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఆయన పాఠాలు బోధించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ […]
BY Pragnadhar Reddy25 Aug 2015 1:05 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 26 Aug 2015 1:15 AM GMT
టీచర్స్ డే… సెప్టెంబర్ 5ను పుస్కరించుకుని ఢిల్లీలోని ఓ పాఠశాల విద్యార్థులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాఠాలు చెప్పనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సరైన సంబంధాలు నెలకొనడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఉపాధ్యాయుడుగా మారడం విశేషం. సెప్టెంబర్ నాలుగు సాయంత్రం రాష్ట్రపతి భవన్ కు సమీపంలో ఉండే సర్వోదయ విద్యాలయ పాఠశాలలో ఏడు, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఆయన పాఠాలు బోధించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆహ్వానం మేరకు ఆయన దీనికి అంగీకరించారు.
Next Story