Telugu Global
Others

ముస్లింలు ముందుకు ..హిందువులు వెన‌క్కు

భారత్‌లో జ‌నాభా పెరుగుద‌ల గ‌ణాంకాలు విచిత్ర ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌డుతోంది. మైనార్టీలైన ముస్లిం జనాభా పెరుగుతోంది. మెజార్టీగా ఉన్న‌ హిందూ జనాభా తగ్గుతోంది. 2001-20011 ఈ పదేళ్ల కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగి 13.8కోట్ల నుంచి 17.22కోట్లకు చేరుకుంది. హిందూ జనాభా 0.7శాతం తగ్గి 96.63కోట్లకు చేరుకుందని మత ప్రాతిపదికన వెల్లడైన తాజా జనగణన వివరాలను బట్టి స్పష్టం అవుతోంది. జనాభా లెక్కల సేకరణ ముగిసిన నాలుగేళ్ల తర్వాత మత ప్రాతిపదికన వివరాలను మంగళవారం వెల్లడించారు. […]

ముస్లింలు ముందుకు ..హిందువులు వెన‌క్కు
X
భారత్‌లో జ‌నాభా పెరుగుద‌ల గ‌ణాంకాలు విచిత్ర ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌డుతోంది. మైనార్టీలైన ముస్లిం జనాభా పెరుగుతోంది. మెజార్టీగా ఉన్న‌ హిందూ జనాభా తగ్గుతోంది. 2001-20011 ఈ పదేళ్ల కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగి 13.8కోట్ల నుంచి 17.22కోట్లకు చేరుకుంది. హిందూ జనాభా 0.7శాతం తగ్గి 96.63కోట్లకు చేరుకుందని మత ప్రాతిపదికన వెల్లడైన తాజా జనగణన వివరాలను బట్టి స్పష్టం అవుతోంది. జనాభా లెక్కల సేకరణ ముగిసిన నాలుగేళ్ల తర్వాత మత ప్రాతిపదికన వివరాలను మంగళవారం వెల్లడించారు. జ‌నాభాలో మ‌త గ‌ణాంకాలు వెల్ల‌డించి కులాల లెక్క‌ల చిక్కులు మాత్రం విప్ప‌లేదు. కుల ప్రాతిపదికన జనాభా వివరాలను వెల్లడించాలని ఆర్‌జెడి, జెడియూ,సమాజ్‌వాది పార్టీ, డిఎంకె వంటి పార్టీలు దీర్ఘకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దేశ జనాభా సామాజిక ఆర్థిక వివరాలను జూలై 3న విడుదల చేశారు. తాజాగా వెలుగు చూసిన వివరాల ప్రకారం దేశ మొత్తం జనాభా 2011నాటికి 121.09కోట్లు. ఇందులో హిందూ జనాభా 96.63కోట్లు (అంటే 79.8శాతం) కాగా, ముస్లిం జనాభా 17.22కోట్ల (14.2శాతం) మేర ఉంది. అలాగే క్రైస్తవ జనాభా 2.78 కోట్లు,సిక్కు జనాభా 2.08కోట్లు, బౌద్ధ మతస్థులు 0.84కోట్లు, జైనులు 0.45కోట్ల మేర ఉన్నారు. వీరు కాకుండా ఇతర మతస్థులు 0.29కోట్ల వరకూ ఉన్నారని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ తాజా నివేదికలో వెల్లడించారు. పదేళ్ల కాలంలో హిందువుల‌తోపాటు సిక్కు, బౌద్ధ మతస్థుల సంఖ్య కూడా 0.2, 0.1శాతం చొప్పున తగ్గినట్టు స్పష్టమవుతోంది. క్రైస్తవులు, జైనుల జ‌నాభాలో పెద్ద‌గా మార్పుల్లేవు.
తెలంగాణలో …..
తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 3.51 కోట్ల మంది జనాభా ఉండగా వారిలో హిందువులు 85.09 శాతం, ముస్లింలు 12.68 శాతం ఉన్నారు. క్రైస్తవుల జనాభా 1.27 శాతంగా నమోదైంది. తెలంగాణలో హిందూ, ముస్లింలలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. క్రైస్తవుల్లో మాత్రం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌లో ముస్లింల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇక్కడ 17.13 లక్షల మంది ముస్లింలు ఉండగా, అత్యల్పంగా ఖమ్మంలో 1.58 లక్షల ముస్లింలు ఉన్నారు. క్రైస్తవుల సంఖ్య కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువగా(87.5వేలు) ఉంది. ఆదిలాబాద్‌లో అతి తక్కువ సంఖ్యలో(15.4) క్రైస్తవులు ఉన్నారు.
ఏపీలో …….
ఆంధ్రప్రదేశ్‌లో 4.93 కోట్ల మంది జనాభా ఉండగా వారిలో హిందువులు 90.86 శాతం ఉన్నారు. ముస్లిం జనాభా 7.3 శాతం, క్రైస్తవుల జనాభా శాతం 1.3గా నమోదైంది. ఏపీలో హిందూ, ముస్లింలలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. క్రైస్తవుల్లో మాత్రం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలవారీగా కర్నూలులో అత్యధికంగా 6,70,737 మంది ముస్లింలు ఉండగా, రెండోస్థానంలో గుంటూరు ఉంది. అత్యల్పంగా శ్రీకాకుళంలో 9025 మంది ముస్లింలు ఉన్నారు. ఏపీలో క్రైస్తవుల సంఖ్య కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఉంది. ఇక్కడ 1,45,598 మంది క్రైస్తవులు ఉన్నారు.
First Published:  26 Aug 2015 4:25 AM GMT
Next Story