Telugu Global
Others

గ‌ద్ద‌ర‌న్నా... జ‌ర సోచాయించే: వామ‌ప‌క్షాలు 

గ‌ద్ద‌ర‌న్నా.. వ‌రంగ‌ల్‌ పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌డానికి జ‌ర సోచాయించ‌రాదే అని కోరుతున్నారు వామ‌ప‌క్ష నేత‌లు. ఈ ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్ష‌, ప్ర‌జాతంత్ర‌, సామాజిక శక్తుల త‌ర‌పున‌  గ‌ద్ద‌ర్‌ను పోటీలోకి దింపాల‌ని భావిస్తున్నామ‌ని, అందుకు ఆయ‌న అంగీక‌రిస్తే బాగుంటుంద‌ని వారు ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై గ‌ద్ద‌ర్ త్వ‌ర‌లో ఒక ప్ర‌క‌ట‌న చేయాల‌ని వారు కోరారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ ఉపఎన్నిక‌పై 10 వామ‌ప‌క్ష పార్టీల జిల్లా స్థాయి స‌న్నాహ‌క స‌మావేశం హ‌న్మ‌కొండ సెంట‌ర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్‌లో […]

గ‌ద్ద‌ర‌న్నా... జ‌ర సోచాయించే: వామ‌ప‌క్షాలు 
X
గ‌ద్ద‌ర‌న్నా.. వ‌రంగ‌ల్‌ పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌డానికి జ‌ర సోచాయించ‌రాదే అని కోరుతున్నారు వామ‌ప‌క్ష నేత‌లు. ఈ ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్ష‌, ప్ర‌జాతంత్ర‌, సామాజిక శక్తుల త‌ర‌పున‌ గ‌ద్ద‌ర్‌ను పోటీలోకి దింపాల‌ని భావిస్తున్నామ‌ని, అందుకు ఆయ‌న అంగీక‌రిస్తే బాగుంటుంద‌ని వారు ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై గ‌ద్ద‌ర్ త్వ‌ర‌లో ఒక ప్ర‌క‌ట‌న చేయాల‌ని వారు కోరారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ ఉపఎన్నిక‌పై 10 వామ‌ప‌క్ష పార్టీల జిల్లా స్థాయి స‌న్నాహ‌క స‌మావేశం హ‌న్మ‌కొండ సెంట‌ర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భద్రంతో పాటు వామ‌ప‌క్షాల‌కు చెందిన ప‌ది పార్టీల నేత‌లు పాల్గొన్నారు. ఈ ఉపఎన్నిక ద్వారా వామ‌ప‌క్షాల ఐక్య‌త‌ను ఎర్ర‌జెండా శ‌క్తిని దేశానికి చాటిచెబుతామ‌ని వీర‌భ‌ద్రం అన్నారు. గ‌ద్ద‌ర్ నిర్ణ‌యం తెలుసుకుని ప‌ది రోజుల్లో పార్టీ అభ్య‌ర్ధిని ప్ర‌కటిస్తామ‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ పాల‌న‌లో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర‌లేద‌ని, ఈ ఉపఎన్నిక‌ల ద్వారా ప్ర‌జలు ఆయ‌న‌కు బుద్ధి చెబుతార‌ని వీర‌భ‌ద్రం అన్నారు.
First Published:  25 Aug 2015 6:40 PM IST
Next Story