రాహుల్ ఎవరంటున్నమోడీ
రాహుల్ గాంధీ ఎవరో తెలియదని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ అంటున్నారు. రాహుల్, ఆయన బావ రాబర్ట్ వాద్రా తాను ఐపీఎల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు తన నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందారని గతంలో లలిత్ మోడీ ట్వీట్ చేశాడు. నెలరోజులు కాకుండా మాట మార్చి ప్లేటు ఫిరాయించాడు. రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలను తానెప్పుడూ కలవలేదని, తన నుంచి ఎటువంటి ప్రయోజనాలు పొందలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిందని సాగుతున్న […]
BY Pragnadhar Reddy26 Aug 2015 6:40 AM IST
X
Pragnadhar Reddy Updated On: 26 Aug 2015 7:40 AM IST
రాహుల్ గాంధీ ఎవరో తెలియదని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ అంటున్నారు. రాహుల్, ఆయన బావ రాబర్ట్ వాద్రా తాను ఐపీఎల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు తన నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందారని గతంలో లలిత్ మోడీ ట్వీట్ చేశాడు. నెలరోజులు కాకుండా మాట మార్చి ప్లేటు ఫిరాయించాడు. రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలను తానెప్పుడూ కలవలేదని, తన నుంచి ఎటువంటి ప్రయోజనాలు పొందలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిందని సాగుతున్న ప్రచారాన్ని కూడా మోడీ ఖండించారు. ఇప్పటివరకూ తనకు వ్యక్తిగతంగా గానీ, మెయిల్‌కు గానీ ఈడీ నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని ఆయన తెలిపారు. ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నుంచి పంపామని చెబుతున్ననోటీసులు ఇవాళ్టి వరకూ తనకు అందలేదని ఆయన చెప్పారు.
పది రూపాయల షేర్ 96 వేలు?
పది రూపాయల షేర్ 96 వేలకు కొంటే తప్పేంటని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోడీ ప్రశ్నిస్తున్నారు. రాజస్థాన్ సీఎం వసుంధరరాజె తనయుడు దుష్యంత్‌సింగ్ నెలకొల్పిన నియంత హెరిటేజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తన కుమార్తె పెట్టుబడులు పెట్టిందని లలిత్ మోడీయే ఒప్పుకున్నాడు. మారిషస్‌కు చెందిన కంపెనీ ద్వారా రిజర్వ్ బ్యాంకు అనుమతితో ఈ పెట్టుబడులు పెట్టామని, ఇందులో తప్పేముందని మోడీ ప్రశ్నించారు. 10 రూపాయల షేర్ 96 వేలకు కొంటే.. ఇప్పుడది 4 నుంచి 5 లక్షల వరకూ ఉందని .. వ్యాపార కోణంలో చూస్తే నాలుగింతలు లాభం వచ్చేలా పెట్టుబడి పెట్టిన తన కుమార్తె నిర్ణయం సరైందేనంటున్నాడు.
Next Story