కిషన్‌రెడ్డిపై టీఆర్ఎస్ మాటల దాడి!
ప్రభుత్వం చేపడుతున్న ప్రతిపనిని విమర్శిస్తూ వచ్చిన బీజేపీని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు టీఆర్ ఎస్ నేతలు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూనే.. రాష్ట్ర బీజేపీని టార్గెట్ చేసింది. తమ బద్దశత్రువైన టీడీపీతో అంటకాగుతున్న బీజేపీపై పీకలదాకా కోపమున్నా..కేంద్రంలో అదే పార్టీ అధికారంలో ఉండటంతో ఏమీ అనలేని పరిస్థితి టీఆర్ ఎస్‌ది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులలో ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణపై సవతి తల్లి ప్రేమనే కనబరుస్తోంది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన […]
BY sarvi26 Aug 2015 5:09 AM IST
X
sarvi Updated On: 26 Aug 2015 5:26 AM IST
ప్రభుత్వం చేపడుతున్న ప్రతిపనిని విమర్శిస్తూ వచ్చిన బీజేపీని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు టీఆర్ ఎస్ నేతలు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూనే.. రాష్ట్ర బీజేపీని టార్గెట్ చేసింది. తమ బద్దశత్రువైన టీడీపీతో అంటకాగుతున్న బీజేపీపై పీకలదాకా కోపమున్నా..కేంద్రంలో అదే పార్టీ అధికారంలో ఉండటంతో ఏమీ అనలేని పరిస్థితి టీఆర్ ఎస్‌ది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులలో ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణపై సవతి తల్లి ప్రేమనే కనబరుస్తోంది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రతి పనికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వమర్శలతో అడ్డుతగులుతూ ఉండటంపై ఇంతకాలం మౌనంగా ఉన్న టీఆర్ ఎస్ పార్టీ ఎదురుదాడికి సిద్ధపడింది. కేంద్రంలో ఉన్నది మీ సర్కారే కదా? కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష చూపిన సంగతి గణాంకాలే చెబుతున్నాయి. దీనిపై ఎందుకు నోరుమెదపడం లేదని బీజేపీరాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ నిలదీశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లుగానే తెలంగాణ ఎందుకు ఇవ్వరని టీఆర్ ఎస్ నేతలు నిలదీస్తున్నారు. వారికి స్తే మాకివ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
కిషన్‌రెడ్డి సమాధానం చెప్పరేం?
టీఆర్ ఎస్ ప్రశ్నలకు కిషన్‌రెడ్డి వెనకడుగు వేయక తప్పని పరిస్థితి. ఓటుకు నోటు కేసు సందర్భంగా కిషన్‌రెడ్డి మౌనంగా ఉన్నారు. మిత్రపక్షంపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. సందు దొరికితే.. తెలంగాణ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచే కిషన్‌రెడ్డి టీఆర్ ఎస్ ఎదురుదాడితో వెనకడుగు వేసినట్లే కనిపిస్తోంది. కేంద్ర నిధులలో వాటా కోసం కలిసి పోరాడుదామన్న టీఆర్ ఎస్ పిలుపుపై ఇంతవరకు స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనం. విభజనహామీలు, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీ వంటి కీలక సమస్యల విషయంలో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అపవాదు బీజేపీ ఇప్పటికే మూటగట్టుకుంది. ఇప్పటివరకు టీఆర్ ఎస్ ఈవిషయంలో రాష్ర్ట బీజేపీని ఎలాంటి మాట అనలేదు. మరోవైపు ఏపీకి నిధులపై హామీల మీద హామీలు గుప్పిస్తుంటే.. ఇక ఉపేక్షించి లాభం లేదని నిర్ణయించుకుంది. అందుకే బీజేపీపై మాటల దాడి మొదలెట్టింది.
Next Story