కబలి" ఫస్ట్ లుక్ లో ఈ విధంగా ఉంటాడట..
సూపర్ స్టార్ రజనీకాంత్ గత యేడాది చేసిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో.. ప్రస్తుతం చేస్తున్న చిత్రంపై ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఈ చిత్రం హిట్ అవ్వక పోతే.. మార్కెట్‌పరంగా రజనీకాంత్‌కు చాలా గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉంది అనేది పరిశీలకుల అంచనా. అందుకే ఎలాగైనా ప్రస్తుతం యువ దర్శకుడు రంజిత్ చేస్తున్న కబాలి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వయసు రీత్య 67 వసంతాలు నిండని రజనీకాంత్‌ను.. ఆయన […]
BY admin26 Aug 2015 7:00 AM IST
X
admin Updated On: 26 Aug 2015 11:23 AM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ గత యేడాది చేసిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో.. ప్రస్తుతం చేస్తున్న చిత్రంపై ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఈ చిత్రం హిట్ అవ్వక పోతే.. మార్కెట్‌పరంగా రజనీకాంత్‌కు చాలా గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉంది అనేది పరిశీలకుల అంచనా. అందుకే ఎలాగైనా ప్రస్తుతం యువ దర్శకుడు రంజిత్ చేస్తున్న కబాలి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వయసు రీత్య 67 వసంతాలు నిండని రజనీకాంత్‌ను.. ఆయన ఫ్యాన్స్ ఇప్పటికి ఆయన్ను యంగ్ తరంగ్‌గానే పరిగణిస్తుంటారు. కబలి చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రజనీకాంత్ లుక్ ఎలా ఉండాలి అనే విషయంలో డైరెక్టర్ చాలా కేర్ తీసుకంటున్నాడు. కొరియాకు చెందిన ఒక కెమెరామెన్‌తో హై ప్రొఫైల్ షూట్ చేశారట.
అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్‌గా హై ఫ్రొఫైల్ ఫొటో షూట్ జరిగింది. కొరియన్ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో షూట్ చేసారు. రజనీ లుక్..సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్‌తో కూడిన విగ్, దాదాపు 1991లో ఆయన చేసిన 'ధర్మ దురై'లో గెటప్‌లాగ ఉంటుంది. బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు ఈ ఫొటో షూట్ కోసం ప్రత్యేకమైన మేకప్ చేసారు. ఫొటో షూట్ లో రాధికా ఆప్టే ఎనభైల నాటి అవుట్ ఫిట్‌తో ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సెప్టెంబర్ రెండవ వారంలో బయిటకు వస్తుంది. చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్‌గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్‌లో జరగనుంది. షూటింగ్ సింగపూర్‌లో ప్లాన్ చేసారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సెప్టంబర్ 17 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.
Next Story