ఆ కౌగిలింత ఎంతో ఆరోగ్యమట!
చెట్ల వలన మనకు కలిగే ప్రయోజనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలంటే, ముఖ్యంగా మానసికంగా దెబ్బతిన్నవారు ప్రకృతికి చేరువగా ఉంటే త్వరగా కుదుటపడతారని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రకృతికి చేరువగానే కాదు, చెట్లను మనసారా కౌగిలించుకుంటే మనిషికీ, చెట్టుకి కూడా ఎంతో ప్రయోజనమని పరిశోధకులు అంటున్నారు. మాధ్యూ సిల్వర్ స్టోన్ అనే శాస్త్రవేత్త తన పుస్తకంలో ఇందుకు సంబంధించి అనేక అంశాలను పొందుపరచాడు. ఈ చెట్టు థెరపీతో మానసిక రుగ్మతలు, అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్‌డి), మానసిక ఏకాగ్రత లోపం, డిప్రెషన్, కొన్నిరకాల తలనొప్పులు తదితర సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని […]
చెట్ల వలన మనకు కలిగే ప్రయోజనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలంటే, ముఖ్యంగా మానసికంగా దెబ్బతిన్నవారు ప్రకృతికి చేరువగా ఉంటే త్వరగా కుదుటపడతారని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రకృతికి చేరువగానే కాదు, చెట్లను మనసారా కౌగిలించుకుంటే మనిషికీ, చెట్టుకి కూడా ఎంతో ప్రయోజనమని పరిశోధకులు అంటున్నారు. మాధ్యూ సిల్వర్ స్టోన్ అనే శాస్త్రవేత్త తన పుస్తకంలో ఇందుకు సంబంధించి అనేక అంశాలను పొందుపరచాడు. ఈ చెట్టు థెరపీతో మానసిక రుగ్మతలు, అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్‌డి), మానసిక ఏకాగ్రత లోపం, డిప్రెషన్, కొన్నిరకాల తలనొప్పులు తదితర సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన చెబుతున్నారు.
తన పుస్తకంలో ఇందుకు సంబంధించిన అనేక పరిశోధనలను ఉదహరిస్తూ, చెట్లకు దగ్గరగా ఉన్న పిల్లల తెలివితేటలు, భావోద్వేగాల సమన్వయం పెరుగుతాయని, వీరు అత్యంత సృజనాత్మకంగా కూడా ఉంటారని వెల్లడించారు. ఇప్పటివరకు విశాలంగా ఉన్న పచ్చని ప్రదేశాలే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయనే అభిప్రాయం ఉంది కానీ ఈ పరిశోధకుడు చెబుతున్న దాన్ని బట్టి చెట్లు, లేదా మొక్కలను ముట్టుకోవడం వలన వాటిలోని ప్రకంపనలు మన శరీరంలో మానసిక, శారీరక మార్పులను తెస్తాయట. చైనాకు చెందిన ఒక తాత్విక, ఆధ్యాత్మిక, మత సిద్ధాంతం… తాయిజం ప్రకారం, చెట్టు అనేది పుట్టినప్పటినుండి నిలబడి ధ్యానం చేస్తుందంటారు. మనుషుల్లా చెట్టులో కదలికలు ఉండవు కనుక అది భూమిలోని శక్తిని, విశ్వశక్తిని మనుషులకంటే ఎక్కువగా తీసుకుంటుందట. అందుకే చెట్టుని పట్టుకుని ధ్యానం చేయమని ఒక తాయిస్ట్ మాస్టర్ తన శిష్యులకు సలహా ఇస్తున్నారు.
చెట్టు చుట్టూ ఉన్న ఆరా (ఎనర్జిటిక్ ఫీల్డ్)లోకి మన శరీరం వెళ్లడం వలన మనలోని నెగెటివ్ ఎనర్జీ పాజిటివ్‌గా మారుతుందని వీరి భావన. అందుకే చెట్టుని చుట్టుకోగానే మనలో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం శాంతి లభిస్తాయట. చెట్టు, కాంతి నుండి ఆహారం తయారుచేసుకున్నట్టుగానే పాజిటివ్ ఎనర్జీని సైతం సమకూర్చుకుంటుందని, చెట్టుని హగ్ చేసుకోవడం వలన ఆ పాజిటివ్ ఎనర్జీని మన శరీరం తీసుకునే అవకాశం కలుగుతుందని వీరి అభిప్రాయం. ఉత్తర ఇటలీలో ఉన్న దామన్‌హర్ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక, పర్యావరణ హితమైన గ్రామం ఉంది. ఇక్కడ చెట్ల సంగీతం మీద పరిశోధనలు చేస్తున్నారు.
వీరు ఇందుకోసం సరికొత్త పరికరాలను కనిపెట్టారు. చెట్ల ఆకులు, వేర్లపై ఏర్పడే విద్యుదయస్కాంత మార్పులను ఈ పరికరాల ద్వారా సంగ్రహించి, వాటిని శబ్దాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు కొందరు చెట్ల పాటల కచెరీలు కూడా నిర్వహించాలని చూస్తున్నారు. ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉన్నా చెట్లతో మన అనుబంధం, మరింత చి(చ)క్కనిదని మాత్రం తెలుస్తోంది కదూ!