హెల్మెట్ పెట్టుకోక పోతే కౌన్సెలింగ్
దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి హెల్మెట్ పెట్టుకోకుండా వాహానాలు నడిపే వారికి రెండు గంటలపాటు కౌన్సెలింగ్ చేయాలని రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతమున్న డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేయాలని స్పష్టం చేసింది. అధికవేగంతో వాహనాలు నడుపుతూ రెడ్ సిగ్నల్స్ వద్ద జంప్ చేసేవారిని, ఓవర్ లోడింగ్, మద్యం, మాదకద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేసే వారిపైన, సెల్‌ఫోన్ నడుపుతూ వాహనం నడిపేవారికి జరిమానాతో పాటు […]
BY sarvi25 Aug 2015 6:42 PM IST
X
sarvi Updated On: 26 Aug 2015 10:27 AM IST
దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి హెల్మెట్ పెట్టుకోకుండా వాహానాలు నడిపే వారికి రెండు గంటలపాటు కౌన్సెలింగ్ చేయాలని రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతమున్న డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేయాలని స్పష్టం చేసింది. అధికవేగంతో వాహనాలు నడుపుతూ రెడ్ సిగ్నల్స్ వద్ద జంప్ చేసేవారిని, ఓవర్ లోడింగ్, మద్యం, మాదకద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేసే వారిపైన, సెల్‌ఫోన్ నడుపుతూ వాహనం నడిపేవారికి జరిమానాతో పాటు కనీసం మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సూచించింది. ఈ ఆంక్షలు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తాయని కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు కమిటీ మంగళవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ లేఖ రాసింది. మద్యం, మాదకద్రవ్యాలు సేవించి వాహనాలు నడిపే వారిని కచ్చితంగా కోర్టులో హాజరు పరిచి, శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. కారులో ప్రయాణించేవారు సీటుబెల్ట్ ధరించడం తప్పనిసరి చేయాలని, బెల్ట్ పెట్టుకోనివారికి రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత జరిమానా విధించాలని సూచించింది. దీనికి సంబంధించిన నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని ప్రత్యేక కమిటీ రాష్ట్రాలను ఆదేశించింది.
Next Story