జీఎస్టీ బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు
జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను) బిల్లు ఆమోదం కోసం వచ్చే నెలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.ఈ బిల్లు కోసమే ఆగస్టు 13తో పూర్తి కావల్సిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియకుండా నిరవధిక వాయిదా పడ్డాయి. దీంతో బిల్లు ఆమోదం కోసం వచ్చే నెలలో తిరిగి సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం కాంగ్రెస్‌నేత మల్లికార్జన ఖర్గేతో పాటు పలు పార్టీల నేతలను కలిశారు. […]
BY sarvi25 Aug 2015 6:44 PM IST
X
sarvi Updated On: 26 Aug 2015 11:00 AM IST
జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను) బిల్లు ఆమోదం కోసం వచ్చే నెలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.ఈ బిల్లు కోసమే ఆగస్టు 13తో పూర్తి కావల్సిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియకుండా నిరవధిక వాయిదా పడ్డాయి. దీంతో బిల్లు ఆమోదం కోసం వచ్చే నెలలో తిరిగి సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం కాంగ్రెస్‌నేత మల్లికార్జన ఖర్గేతో పాటు పలు పార్టీల నేతలను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఇప్పటికే అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపామని, అవసరమైతే సోనియా రాహుల్‌లను కూడా కలిసి సహకరించమని కోరతామని చెప్పారు. అయితే, కాంగ్రెస్ మాత్రం కేంద్రం రూపొందించిన తుది జీఎస్టీ బిల్లును పరిశీలించాకే మద్దతు విషయం ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
Next Story