Wonder World 6
మంచు పుష్పాలు! అమెరికాలోని మిస్సోరిలో గల డైమండ్ అనే ప్రాంతంలో ఈ మంచు పుష్పాలను మనం చూడవచ్చు. శీతాకాలంలో విపరీతంగా కురిసిన మంచు రోజులో ఎండ పెరిగేకొద్దీ కరిగిపోతుంది. అయితే అలా కరిగే క్రమంలో మంచు పంపులు తిరిగిపోయి పువ్వులవలె కనిపిస్తుంది. ఈ మంచు పుష్పాలు చూపరులకు భలే కనువిందు చేస్తాయి. —————————————————————————————— మనకు తెలియని షేక్స్‌పియర్! విలియం షేక్స్‌పియర్ అద్భుతమైన నవలా రచయితగానే ప్రపంచానికి తెలుసు. కానీ ఆయన అనేక కొత్త పదాల సృష్టికర్త కూడా. […]
మంచు పుష్పాలు!
అమెరికాలోని మిస్సోరిలో గల డైమండ్ అనే ప్రాంతంలో ఈ మంచు పుష్పాలను మనం చూడవచ్చు. శీతాకాలంలో విపరీతంగా కురిసిన మంచు రోజులో ఎండ పెరిగేకొద్దీ కరిగిపోతుంది. అయితే అలా కరిగే క్రమంలో మంచు పంపులు తిరిగిపోయి పువ్వులవలె కనిపిస్తుంది. ఈ మంచు పుష్పాలు చూపరులకు భలే కనువిందు చేస్తాయి.
——————————————————————————————
మనకు తెలియని షేక్స్‌పియర్!
విలియం షేక్స్‌పియర్ అద్భుతమైన నవలా రచయితగానే ప్రపంచానికి తెలుసు. కానీ ఆయన అనేక కొత్త పదాల సృష్టికర్త కూడా. దాదాపు 1,700 వరకు కొత్త పదాలను ఆయన సృష్టించాడు. అవన్నీ ఇపుడు మనం విరివిగా ఉపయోగిస్తున్నవే. బిడాజిల్డ్, అరౌజ్‌డ్, డ్రగ్ట్, అడిక్షన్, పకింగ్, బ్లడ్‌స్టెయిన్డ్, అక్యూజ్డ్, డాంట్‌లెస్, అసాసినేషన్, కోల్డ్ బ్లడెడ్,ఎల్‌బో, ఐబాల్ వాటిలో కొన్ని.