Telugu Global
Others

అభివృద్దికి అడ్డుపడితే అరెస్ట్‌లే: తలసాని

కొంత‌మంది ఎజెండా లేకుండా అభివృద్ధికి అడ్డు ప‌డుతున్నార‌ని ఇక‌పై వారిని ఉపేక్షించ‌బోమ‌ని ఆయ‌న అన్నారు. అభివృద్ధికి అడ్డం ప‌డేవారు ఎవ‌రైనా అరెస్ట్ చేసి లోప‌లేస్తామ‌ని మంత్రి  తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. నిజామాబాద్‌లోని ఆర్అండ్‌బి అతిథిగృహంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌ర్వాత వాణిజ్య పన్నుల వ‌సూలు పెరిగి ప్ర‌భుత్వం వ‌ద్ద పుష్క‌లంగా నిధులున్నాయ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాదవ్ చెప్పారు. అందువ‌ల్ల  చీప్‌లిక్క‌ర్ ఆదాయంపై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వానికి లేద‌ని మంత్రి అన్నారు. ప్ర‌జారోగ్యం కోసం  ప్ర‌భుత్వం […]

అభివృద్దికి అడ్డుపడితే అరెస్ట్‌లే: తలసాని
X
కొంత‌మంది ఎజెండా లేకుండా అభివృద్ధికి అడ్డు ప‌డుతున్నార‌ని ఇక‌పై వారిని ఉపేక్షించ‌బోమ‌ని ఆయ‌న అన్నారు. అభివృద్ధికి అడ్డం ప‌డేవారు ఎవ‌రైనా అరెస్ట్ చేసి లోప‌లేస్తామ‌ని మంత్రి తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. నిజామాబాద్‌లోని ఆర్అండ్‌బి అతిథిగృహంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌ర్వాత వాణిజ్య పన్నుల వ‌సూలు పెరిగి ప్ర‌భుత్వం వ‌ద్ద పుష్క‌లంగా నిధులున్నాయ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాదవ్ చెప్పారు. అందువ‌ల్ల చీప్‌లిక్క‌ర్ ఆదాయంపై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వానికి లేద‌ని మంత్రి అన్నారు. ప్ర‌జారోగ్యం కోసం ప్ర‌భుత్వం గుడుంబాను నిరోధించి చీప్ లిక్క‌ర్‌ను ప్ర‌వేశ‌పెడుతోంది త‌ప్ప ఖ‌జానా నింపుకోడానికి కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈకార్య‌క్ర‌మంలో నిజామాబాద్ ఎంపి క‌విత, ఇత‌ర టీఆర్ఎస్ నేత‌లు పాల్గొన్నారు.
First Published:  24 Aug 2015 6:40 PM IST
Next Story