264 గ్రామాల దత్తతకు రతన్ టాటా ఓకే
విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 264 గ్రామాల దత్తత ఒప్పందంపై టాటా ట్రస్టుల చైర్మన్ రతన్ టాటా సంతకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడకు సమీపంలోని ఎనికెపాడులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ఒప్పందంపై సంతకం చేశారు. టాటా సంస్థ దత్తత తీసుకున్న ఈ గ్రామాల్లో 5 అంశాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని రతన్‌టాటా వెల్లడించారు. సమగ్ర పోషణ, మాతా శిశుఆరోగ్యం సంరక్షణ, మత్స్య సంపద అభివృద్ధి, వెదురు పెంపకంతో పరిశ్రమల స్థాపన, మౌలిక […]
BY sarvi24 Aug 2015 6:37 PM IST
X
sarvi Updated On: 25 Aug 2015 6:49 AM IST
విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 264 గ్రామాల దత్తత ఒప్పందంపై టాటా ట్రస్టుల చైర్మన్ రతన్ టాటా సంతకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడకు సమీపంలోని ఎనికెపాడులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ఒప్పందంపై సంతకం చేశారు. టాటా సంస్థ దత్తత తీసుకున్న ఈ గ్రామాల్లో 5 అంశాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని రతన్‌టాటా వెల్లడించారు. సమగ్ర పోషణ, మాతా శిశుఆరోగ్యం సంరక్షణ, మత్స్య సంపద అభివృద్ధి, వెదురు పెంపకంతో పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించి అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.
Next Story