ఐసీయులో హాట్ హీరోయిన్
పలు కన్నడ సినిమాల్లో నటించి సౌత్ లో మంచి పేరుతెచ్చుకున్న హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రస్తుతం హాస్పిటల్ లో ఉంది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఓ షూటింగ్ లొకేషన్ లో రాగిణి తలకు బలమైన దెబ్బ తగిలింది. తల నుంచి తీవ్రంగా రక్తం కారడంతో హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కన్నడలో నానే నెక్ట్స్ సీఎం అనే సినిమా చేస్తోంది రాగిణి ద్వివేది. ఈ సినిమా షూటింగ్ కోసం టీం అంతా […]
BY Pragnadhar Reddy25 Aug 2015 12:21 AM IST
X
Pragnadhar Reddy Updated On: 25 Aug 2015 4:24 AM IST
పలు కన్నడ సినిమాల్లో నటించి సౌత్ లో మంచి పేరుతెచ్చుకున్న హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రస్తుతం హాస్పిటల్ లో ఉంది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఓ షూటింగ్ లొకేషన్ లో రాగిణి తలకు బలమైన దెబ్బ తగిలింది. తల నుంచి తీవ్రంగా రక్తం కారడంతో హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కన్నడలో నానే నెక్ట్స్ సీఎం అనే సినిమా చేస్తోంది రాగిణి ద్వివేది. ఈ సినిమా షూటింగ్ కోసం టీం అంతా మైసూర్ వెళ్లింది. అక్కడ రాగిణితో పాటు మిగతా ఫైటర్లంతా పాల్గొంటున్న ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. అంతా బాగానే ఉందనుకున్న టైమ్ లో.. షూటింగ్ లో భాగంగా.. ఓ హాకీ స్టిక్ వచ్చి రాగిణి తలకు బలంగా తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఊహించని ఘటనతో యూనిట్ అంతా షాక్ అయింది. ప్రస్తుతం రాగిణికి డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరో 24 గంటల తర్వాత ఆరోగ్య పరిస్థితి చెబుతామంటున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఓ ఫైటర్ పై పోలీస్ కేసు నమోదైంది.
Next Story