Telugu Global
Others

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: జైట్లీ

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడితో తమ సమావేశం విస్త్రతంగా జరిగిందని, గంటన్నరపాటు తాను, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కలిసి ఆయనతో అనేక విషయాలు చర్చించామని తెలిపారు. విభజన చట్టంలోని  46, 90, 94 సెక్షన్‌పై ప్రధానంగా చర్చ జరిగిందని, ప్రత్యేక హోదా సాధ్యాసాధ్యాలపై కూడా తాము మాట్లాడామని  అరుణ్‌జైట్లీ తెలిపారు. హోదా విషయం ఇంకా కేంద్ర పరిశీలనలో ఉందని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ […]

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: జైట్లీ
X
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడితో తమ సమావేశం విస్త్రతంగా జరిగిందని, గంటన్నరపాటు తాను, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కలిసి ఆయనతో అనేక విషయాలు చర్చించామని తెలిపారు. విభజన చట్టంలోని 46, 90, 94 సెక్షన్‌పై ప్రధానంగా చర్చ జరిగిందని, ప్రత్యేక హోదా సాధ్యాసాధ్యాలపై కూడా తాము మాట్లాడామని అరుణ్‌జైట్లీ తెలిపారు. హోదా విషయం ఇంకా కేంద్ర పరిశీలనలో ఉందని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ అమలు చేస్తామని ప్రధాని మోడి హామీ ఇచ్చారని, ఇందుకు రోడ్‌ మ్యాప్‌ తయారు చేయమని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ను ఆదేశించారని జైట్లీ చెప్పారు. కేంద్రం ఇచ్చిన హామీలను ఎప్పటి నుంచి, ఎలా అమలు చేస్తామన్న దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి నీతి ఆయోగ్‌ అధికారులు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. తమ సమావేశంలో పీఎంఓ అధికారులు, నీతి ఆయోగ్‌ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నట్టు తెలిపారు.
ఒక్కరోజులో పరిష్కారం కాదు: వెంకయ్య
సమస్యలన్నీ ఒక్కరోజులో పరిష్కారమయ్యేవి కాదని, దీన్ని రాజకీయం చేయొద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రధానిని కలవడానికి ముందు చంద్రబాబునాయుడు ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీకి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా హాజరయ్యారు. ఒక తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్‌కు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ప్లానింగ్‌ కమిషన్‌, జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం లేకపోవడం వల్ల ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో చిక్కులు ఎదురవుతున్నాయని వెంకయ్యా చెప్పారు. ఏపీకీ ఇచ్చిన హామీలు మొత్తం అమలయ్యేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. విభజన చట్టంపై చర్చించామని, సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రానికి సాంకేతిక సమస్యలున్నాయని మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు.
First Published:  25 Aug 2015 8:34 AM IST
Next Story